Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: దూసుకుపోతున్న యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం..

కిరణ్ అబ్బవరం.. ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరు. రాజావారు... రాణీ గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. ఇటీవల

Kiran Abbavaram: దూసుకుపోతున్న యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 6:01 PM

కిరణ్ అబ్బవరం.. ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరు. రాజావారు… రాణీ గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. ఇటీవల వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాడు కిరణ్ అబ్బవరం..

ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌- క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు… అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేనిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులు. ముహుర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబి) కెమెరా స్వీచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గారు క్లాప్ నిచ్చారు. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ముహుర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, చిరంజీవి (చెర్రీ)లు దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి కెమెరా వర్క్ వెంకట్.సి.దిలీప్, చేయగా.. ప్రొడక్షన్ డిజైనర్ వర్క్… జేవీ, మాటలు రమేష్ కాదూరి అందిస్తున్నారు.

Also Read: Viral Photo: ఈ బూరెబుగ్గల చిన్నది మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా!

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ను దారుణంగా ట్రోల్‌ చేసిన నెటిజన్‌.. ‘ఎ‍ప్పుడు సచ్చిపోతమో తెలీదంటూ’ క్లాస్‌ పీకిన అఖిల్‌..

AHA Upcoming Movies: డిసెంబర్‌లో కొత్త చిత్రాలతో ‘ఆహా’ సందడి.. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో..