AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA Upcoming Movies: డిసెంబర్‌లో కొత్త చిత్రాలతో ‘ఆహా’ సందడి.. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో..

AHA Upcoming Movies: తొలి తెలుగు ఓటీటీ 'ఆహా' ప్రేక్షకులకు వినోదాల విందు అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నెలలో ఆడియన్స్‌కు మరిచిపోలేని వినోదాలను పంచనుంది. ఇందులో భాగంగా సినిమాలతో పాటు..

AHA Upcoming Movies: డిసెంబర్‌లో కొత్త చిత్రాలతో 'ఆహా' సందడి.. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో..
Aha Movies
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2021 | 6:01 PM

Share

AHA Upcoming Movies: తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రేక్షకులకు వినోదాల విందు అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నెలలో ఆడియన్స్‌కు మరిచిపోలేని వినోదాలను పంచనుంది. ఇందులో భాగంగా సినిమాలతో పాటు ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని వెబ్‌సిరీస్‌లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆహాకు మాత్రమే ప్రత్యేకంగా నిలిచే టాక్‌ షోలు, చెఫ్‌ షోలతో ఆకట్టుకుంటోన్న ఈ ఓటీటీ తాజాగా కొత్త చిత్రాలతో రానుంది. డిసెంబర్‌లో ఆహా ఓటీటీ వేదికగా విడుదలకానున్న సినిమాలు ఏంటంటే..

మంచి రోజులు వచ్చాయి:

ఏక్‌ మినీ కథతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంతోష్‌ శోభన్‌ హీరోగా, మెహరీన్‌ హీరోయిన్‌గా తెరెక్కిన మంచి రోజులు వచ్చాయి డిసెంబర్‌3న విడుదల కానుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి.

పుష్పక విమానం..

డిసెంబర్‌లో ఆహాలో సందడి చేయనున్న మరో చిత్రం ఆనంద్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ఫక విమానం’. ఈ సినిమాకు విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ సినిమాకు ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఆనంద్‌ దేవరకొండ అద్భుత నటన, వినూత్నమైన కథాంశం, కామెడితో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇక ఈ సినిమా ఆహాలో డిసెంబర్‌ 10 నంచి స్ట్రీమింగ్ కానుంది.

అనుభవించి రాజా..

రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా డిసెంబర్‌లో ఆహాలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. సుప్రీయ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నవంబర్‌ 26న విడుదలైన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇట్స్‌ నాట్‌ ఏ లవ్‌ స్టోరీ..

ఆహా ఒరిజినల్‌ ఫిలిమ్‌ అయిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ప్రిన్స్‌, నేహా క్రిష్ణ ప్రధాన పాత్ర దారులుగా తెరకెక్కిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రానుంది. అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు అమెరికాలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. అనుకోకుండా ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కోవడంతో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సేనాపతి..

రాజేంద్ర ప్రసాద్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న ఈ ఒరిజినల్‌ను ఆహా వేదికగా డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నారు. థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌గా ఉండనున్నట్లు సమాచారం. వీటితో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రిస్మస్‌ తాతా అనే సినిమాను కూడా ఆహా వేదికగా విడుదల చేయనున్నారు. క్రిస్మస్‌ కానుకగా దీనిని విడుదల చేయనున్నారు.

Also Read: Samantha: సమంత హాలీవుడ్‌ చిత్రానికి ఆ హీరోనే కారణమా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త..

Egg Secret: గుడ్డు శాఖాహారమా? మాంసాహారమా? గుట్టురట్టు చేసిన శాస్త్రవేత్తలు.. మరి మన శాస్త్రాలు ఏంచెబుతున్నాయి..?

MAAలో ఏం జరుగుతోంది..? మంచు కాంపౌండ్‌లో ‘100 రోజుల టెన్షన్’ ఎందుకు?