NTRUHS Recruitment: ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
NTRUHS Recruitment: విజయవాడలోని డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం...
NTRUHS Recruitment: విజయవాడలోని డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 15 ఖాళీలకు గాను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (03), కంప్యూటర్ ఆపరేటర్ (10), డేటా ఎంట్రీ ఆపరేటర్ (02) పోస్టులు ఉన్నాయి.
* సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సీఎస్‌ఈ/ ఐటీ/ ఈసీఈ సబ్జెక్టుల్లో బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
* కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ (కంప్యూటర్స్)/ ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత. రెండేళ్ల అనుభవం ఉండాలి.
* డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకునే డిగ్రీ (కంప్యూటర్స్)/ ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత. రెండేళ్ల అనుభవం ఉండాలి.
ముఖ్యమై విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పక్కన, విజయవాడ-520008, ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 08-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Viral Video: బంగారం పూతతో బర్గర్.. ఉచితంగా రుచి చూసే అవకాశం.. ఎక్కడంటే..