Jagananna Vidya Deevena: ఉన్నత స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకారాదు.. తలరాతలు మారాలంటే చదువకోవల్సిందేః సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన పథకం అమలులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

Jagananna Vidya Deevena: ఉన్నత స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకారాదు.. తలరాతలు మారాలంటే చదువకోవల్సిందేః సీఎం జగన్
Cm Ys Jagan
Follow us

|

Updated on: Nov 30, 2021 | 12:20 PM

Jagananna Vidya Deevena Scheme 2021: ప్రతి ఇంట పేదరికం పోవాలి, మన తలరాతలు మారాలన్న.. ప్రతివర్గం పెద్ద చదువులు చదువుకోవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో చదువుకునేవారి సంఖ్య బాగా పెరగాలన్న సీఎం.. బాగా చదువుకుంటేనే తలరాతలు మారుతాయన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు.. దాని నుంచి బయటపడాలన్నారు. నూటికి నూరుశాతం అక్షరాస్యత కానేకాదు, పిల్లలను వందశాతం గ్రాడ్యయేట్లగా నిలబెట్టాలన్నది మన లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నామన్న జగన్.. పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తున్న ఘనత ఒక్క వైసీపీకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి.

జగనన్న విద్యా దీవెన పథకం అమలులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. జగనన్న విద్యా దీవెన దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పూర్తి ఫీజు రియింబర్స్‌మెంటే కాక, గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి రూ.6259 కోట్లు చెల్లించామని సీఎం చెప్పారు. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే (మూడు నెలలు) విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నామని వెల్లడించారు, తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా… తల్లులు ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్లి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారన్నారు. కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతాయని సీఎం తెలిపారు. అయితే, జగనన్న విద్యా దీవెన పథకం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉన్నత విద్య చదివే అవకాశం, అందరికీ వర్తింపు, తద్వారా అన్ని విధాలుగా అయా కుటుంబాలు స్ధిరపడనున్నట్లు సీఎం తెలిపారు.

ఇదిలావుంటే, జగనన్న విద్యా దీవెన – మొదటి విడత – 19 ఏప్రిల్‌ 2021 రెండో విడత – 29 జులై 2021, మూడవ విడత – 30 నవంబర్‌ 2021, నాలుగవ విడత – ఫిబ్రవరి 2022న అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి పలుకుతూ.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్లు బకాయిలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.6,259 కోట్లు చెల్లించింది. కరోనా సమయంలో కూడా అంతరాయం లేకుండా ఫీజుల చెల్లింపు జరపింది వైసీపీ సర్కార్.

గతంలో మెరిట్‌ఉన్నా.. ఆర్థికభారం కారణంగా ప్రైవేటులో ప్రసిద్ధ కాలేజీలు, ప్రైవేటు యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి గతంలో ఉండేది.. వీటిలో మార్పులు తీసుకు వచ్చామని సీఎం తెలిపారు. అన్ని ప్రైవేటు యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్‌ అయితే కచ్చితంగా యాభైశాతం, ఇతర కోర్సుల్లో అయితే 35 శాతం సీట్లు గవర్నమెంటు కోటాలో భర్తీచేయాలని మార్పులు తీసుకువచ్చి చట్టం చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గతంలో అవకాశంలేని పేద విద్యార్థులకు అవకాశం వస్తోంది. ఈ ఏడాది దాదాపు 2118 విద్యార్థులకు అవకాశం వచ్చిందన్నారు. వీరికి పూర్తి ఫీజు రియంబర్స్‌ మెంట్‌ఇస్తున్నామని తెలిపారు. ప్రతిభ ఉన్న అర్హులైన పేదవిద్యార్థులకు గతానికి భిన్నంగా చదువుకునే అవకాశం లభించిందన్నారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వే రిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థల జీఈఆర్‌ రేష్యో 2020 నాటికి 35.2 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. 2018 –19 తో పోలిస్తే.. 2019–20 మధ్య పెరుగుదల దేశవ్యాప్తంగా 3.04 అయితే, మన రాష్ట్రంలో 8.6శాతంగా నమోదయ్యిందన్నారు.

జీఈఆర్‌ దేశవ్యాప్తంగా ఎస్సీల్లో 1.7శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28శాతం ఉంటే… మన రాష్ట్రంలో ఎస్సీల్లో 7.5, ఎస్టీల్లో 9.5శాతం, విద్యార్థినుల్లో 11.03శాతంగా నమోదయ్యిందన్నారు. దేశంకన్నా మనం మెరుగ్గా ఉన్నాం, ప్రయాణించాల్సిన దూరం చాలా ఉందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్‌ చదివేవాళ్లకి రూ.15వేలు, డిగ్రీ.. ఇతర కోర్సులు చదివేవారికి రూ.20వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ రూ.2267 కోట్ల రూపాయలు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మరిన్ని విద్యావకాశాలను మెరుగు పరిచేందుకు కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు తీసుకు వస్తున్నామన్నారు. విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్డీయూ యూనివర్శిటీని తీసుకు వస్తున్నామని. ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీ, కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ, కురుపాంలో ఇంజినీరింగ్‌కాలేజీ, సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్‌ కాలేజీ త్వరలోనే రానున్నట్లు సీఎం తెలిపారు 2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో రూ. 880 కోట్లతో మరమత్తులతో శ్రీకారం చుట్టామన్నారు. మరో 2 సంవత్సరాల్లో ఇవన్నీకూడా పూర్తిగా పనులు అవుతాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిగ్రీ అనే కోర్సుల్లో కూడా మార్పులకు శ్రీకారం చుట్టామన్న సీఎం.. ఇంగ్లిషు మీడియంవైపు అడుగువవేస్తున్నామన్నారు. టెక్ట్స్‌ బుక్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషు ముద్రిస్తున్నాం. ఉద్యోగాలు ఇచ్చే కోర్సులుగా వీటిని తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ఏకంగా 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. త్వరలో ఒక స్కిల్‌యూనివర్శిటీని కూడా తీసుకు వస్తున్నామని తెలిపారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?