AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బంగారం పూతతో బర్గర్‌.. ఉచితంగా రుచి చూసే అవకాశం.. ఎక్కడంటే..

సాధారణంగా బర్గర్లలో చికెన్‌, ఛీజ్‌, వెజ్‌ అంటూ ఎన్నో రకాల వెరైటీలుంటాయి. అయితే పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఒక వీధి వ్యాపారి వెరైటీగా బంగారం పూతతో బర్గర్లను తయారుచేస్తున్నాడు.

Viral Video: బంగారం పూతతో బర్గర్‌.. ఉచితంగా రుచి చూసే అవకాశం.. ఎక్కడంటే..
Basha Shek
|

Updated on: Nov 30, 2021 | 12:00 PM

Share

సాధారణంగా బర్గర్లలో చికెన్‌, ఛీజ్‌, వెజ్‌ అంటూ ఎన్నో రకాల వెరైటీలుంటాయి. అయితే పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఒక వీధి వ్యాపారి వెరైటీగా బంగారం పూతతో బర్గర్లను తయారుచేస్తున్నాడు. వాటికి ‘వెజ్‌ గోల్డ్‌ బర్గర్‌’ అనే పేరు పెట్టి విక్రయిస్తున్నాడు. రుచికి రుచితో పాటు బంగారం పూతతో చూడగానే ఆకర్షించేలా బర్గర్లు ఉండడంతో కస్టమర్లు కూడా లొట్టలేసుకుని మరీ వీటిని ఆరగిస్తున్నారు. మరి బంగారం పూతతో బర్గర్లను తయారుచేస్తున్నప్పుడు ధర కూడా భారీగానే ఉండాలి కదా. అందుకే ఒక్కొక్క బర్గర్‌ను రూ.999కి విక్రయిస్తున్నాడు. ఇదే సమయంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఒక ఛాలెంజ్‌ పెట్టాడు. అదేంటంటే.. ఈ వెజ్‌ గోల్డ్‌ బర్గర్‌ను 5 నిమిషాల్లో తింటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదట. పైగా ఛాలెంజ్‌ పూర్తి చేస్తే రూ.999లు తనే తిరిగి కస్టమర్‌కు చెల్లిస్తాడట.

లూథియానా నగరంలోని బాబా దీప్ సింగ్ గురుద్వారా చౌక్ మోడల్ టౌన్‌లో బాబాజీ దుకాణం ఉంది. కాగా ఈ గోల్డ్‌ బర్గర్ తయారీ, విక్రయాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో భాగంగా వివిధ రకాల కూరగాయలు, వెన్న, సాస్‌లు, పన్నీర్‌, పలు రకాల డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించి బర్గర్‌ను తయారుచేయడం మనం చూడవచ్చు. అదేవిధంగా బర్గర్‌ రెడీ అయిన తర్వాత బంగారపు పూతతో వాటిని టాపప్‌ చేస్తాడు. కాగా ప్రస్తుతం బాబాజీ ‘వెజ్‌ గోల్డ్‌ బర్గర్‌’ హాట్‌ టాపిక్‌గా మారింది. కస్టమర్లు కూడా భారీగానే వస్తున్నాడు. ఇతర బర్గర్లతో పోల్చితే ఈ బర్గర్లు చౌకగా, రుచిగా ఉన్నాయంటూ లొట్టలేసుకుని తింటున్నారు.Also Read:

Face For Robots: మీ ఫేస్‌రైట్స్ రూ.1.5 కోట్లు.. ఫేస్‌తో చిట్టి రోబోని తయారుచేస్తామంటున్న కంపెనీ.. ఎలా అప్లై చేయాలంటే..

Charanjit Singh Channi: చిన్నారులతో కలిసి సీఎం ఎంజాయ్.. హెలికాప్టర్‌లో తిప్పిన సీఎం చన్నీ.. వీడియో

Andhra Pradesh: తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మరో అద్భుత నిర్మాణం.. వైరల్ అవుతున్న ఫోటోలు..