Watch Video: డెంజరస్ యాక్సిడెంట్.. మద్యం మత్తులో దూసుకొచ్చి చంపారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Shocking Accident: కారులోని ఆ యువకులంతా మద్యం తాగున్నారు.. రోడ్డుపై కారు రయ్యిరయ్యిన దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న ఇద్దరిని

Watch Video: డెంజరస్ యాక్సిడెంట్.. మద్యం మత్తులో దూసుకొచ్చి చంపారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Accident
Follow us

|

Updated on: Nov 30, 2021 | 12:16 PM

Shocking Accident: కారులోని ఆ యువకులంతా మద్యం తాగున్నారు.. రోడ్డుపై కారు రయ్యిరయ్యిన దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టగా.. వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదం పంజాబ్‌లోని మోహాలీలో చోటుచేసుకుంది. మొహాలీలోని ఘరువాన్‌లోని చండీగఢ్ విశ్వవిద్యాలయం ముందు ఆదివారం మధ్యాహ్నం అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండీగఢ్ వైపు నుంచి అతివేగంతో వస్తుండగా.. రోడ్డు దాటేందుకు ఇద్దరు వ్యక్తులు డివైడర్‌పై నిల్చోని ఉన్నారు. ఈ క్రమంలో అతి వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి ఇద్దరు ఆటో డ్రైవర్లపై నుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత కారు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులు కూడా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకడైన సంజీత్ సింగ్ (26) చికిత్స పొందుతూ ఖరార్ సివిల్ ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

యాక్సిడెంట్ వీడియో.. 

ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లను ఘరువాన్‌కు చెందిన సురీందర్ సింగ్ (41), జమీల్ ఖాన్ (40)గా గుర్తించారు. ఘరువాన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) హిమ్మత్ సింగ్ మాట్లాడుతూ.. కారులో ఐదుగురు వ్యక్తులున్నారని.. వారంతా మద్యం తాగినట్లు తెలిపారు. వాహనంలో మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ ప్రమాదాన్ని బట్టి కారు ఎంత వేగంగా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Also Read:

Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..

Birthday Party: బర్త్‌ డే పార్టీలో స్నేహితుల అరాచకం.. ప్రెజర్‌ పంప్‌‌తో ఏం చేశారో తెలుసా..?