- Telugu News పొలిటికల్ ఫొటోలు Andhra Pradesh Chief Minister YS Jagan Visits Goshala Near Tadepalli Cm Camp Office
Andhra Pradesh: తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మరో అద్భుత నిర్మాణం.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Andhra Pradesh: తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మరో అద్భుత నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Updated on: Nov 30, 2021 | 6:51 AM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంటివద్ద ఓ గొప్ప నిర్మాణం వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి నివాసం వద్ద నూతన గోశాలను ఏర్పాటు చేశారు. ఆ గోశాలను సందర్శించారు ముఖ్యమంత్రి జగన్. ఇటీవలే సీఎం నివాస ప్రాంగణంలో గోశాలను నిర్మించారు. పూర్తిగా సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ గోశాలను నిర్మించారు. మట్టిపెంకులు, వెదురు బొంగులు, తడికెలతో గోశాలను ఏర్పాటు చేశారు.

ఆరుబయట గోవులు నీరు తాగేందుకు కొలను, పచ్చికబయళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, పచ్చని చెట్లను కూడా నాటడంతో చూడచక్కగా ఉంది. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న గోశాలను ఆసక్తిగా తిలకించారు సీఎం.

ఈ గోశాలకు పలు జాతులకు చెందిన ఆవులను తీసుకొచ్చి ఉంచారు. గిర్ జాతితో పాటు అరుదైన ఆవులు ఇక్కడ ఉన్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పలు గోవులను ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకొచ్చారు. గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం జగన్, చెవిరెడ్డి.

కొత్తగా నిర్మించిన గోశాలలో కలియదిరిగిన జగన్.. నిర్మించిన తీరు, గోమాతలకు చేసిన ఏర్పాట్ల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జగన్ చిన్నపిల్లాడిలా మారి ఆవులను నిమురుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గోశాలపై తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.