IIIT Hyderabad: తెలుగుపై పట్టుందా.? తెలుగులో రాయగలరా.? అయితే ఈ అవకాశం మీకోసమే.. ఐఐఐటీ హైదరాబాద్‌లో..
IIIT Hyderabad internship: మనకు ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటాం. అయితే గూగుల్‌లో వెతకగానే ముందుగా వికిపీడియాలో సమాచారం ప్రత్యక్షమవుతుంది. దీని ఆధారంగా...
IIIT Hyderabad internship: మనకు ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటాం. అయితే గూగుల్‌లో వెతకగానే ముందుగా వికిపీడియాలో సమాచారం ప్రత్యక్షమవుతుంది. దీని ఆధారంగా మన సందేహానికి ఓ పరిష్కారాన్ని ఆలోచించుకుంటాం. మారుతోన్న కాలానికి అణుగుణంగా వికిపీడియా సేవలు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి ఇందులో ఉండే సమాచారాన్ని మనలాంటి వారే అందిస్తారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు.? ఈ సమచారాన్ని కొందరు విద్యావంతులు, ఉద్యోగులు తమ అభిరుచి మేరకు వికీపీడియా సమాచారాన్ని మెరుగుపరుస్తుంటారు. ఈ క్రమంలోనే తెలుగు వికీపీడియా సమాచారాన్ని మరింత పెరుగుపరిచేందుకు ఐఐఐటీ హైదరాబాద్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగానే ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ప్రాజెక్ట్ ఇండిక్ వికీలో ఇంటర్న్‌షిప్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఇంటర్న్‌షిప్ శిక్షణలో భాగంగా వివిధ అంశాలపై వికీలో ఉన్న సమాచార నాణ్యతను పెంచే లక్ష్యంతో మొబైల్, కంప్యూటర్ అంశాలపై అవగాహణ కల్పించనున్నారు. ఇంటర్న్‌షిప్‌ను విజయంతంగా పూర్తి చేసిన వారికి ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – హైదరాబాద్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్‌ను కూడా అందించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తుల చేసుకోవడం కోసం ఈ https://forms.gle/haRUiSubDswZL17G8 లింక్‌ను క్లిక్ చేయండి.. మరింత సమాచారం కోసం 9014120442 నెంబర్‌ను సంప్రదించండి.
ముఖ్యమైన విషయాలు..
ఇంటర్న్ షిప్ వ్యవధి: 06-12-2021 నుంచి 31-01-2022 వరకు అర్హతలు: ఎలాంటి తప్పులు లేకుండా తెలుగులో రాయడం వచ్చి ఉండాలి. డిగ్రీ/ ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం చదువుతున్న వారైనా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్ ఉండాలి.
MPDO shed Tears: మహిళా అధికారిణిపై అధికార పార్టీ నేతల జులుం.. కన్నీరు పెట్టిన ఎంపీడీఓ!