AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MPDO shed Tears: మహిళా అధికారిణిపై అధికార పార్టీ నేతల జులుం.. కన్నీరు పెట్టిన ఎంపీడీఓ!

తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ అధికారిణి చేత కన్నీరు పెట్టించారు స్థానిక నాయకులు. సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లతో సంబంధం లేదన్న వినిపించుకోకుండా స్థానిక నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

MPDO shed Tears: మహిళా అధికారిణిపై అధికార పార్టీ నేతల జులుం.. కన్నీరు పెట్టిన ఎంపీడీఓ!
Mpdo Shed Tears
Balaraju Goud
|

Updated on: Nov 30, 2021 | 9:52 AM

Share

Woman MPDO shed Tears: తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ అధికారిణి చేత కన్నీరు పెట్టించారు స్థానిక నాయకులు. సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లతో సంబంధం లేదన్న వినిపించుకోకుండా స్థానిక నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మండలాధికారి కంట కన్నీరు పెటుకున్నారు.

అయినవిల్లి మండల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో హౌసింగ్ డీఈ ఎమ్.జి.కె నాగరాజు అధ్యక్షతన మండల సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించేందుకు సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ వేదిక మీదకు ఎమ్మెల్యేతో పాటుగా స్థానిక జడ్పీటిసి, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీడీవో, తహసీల్దారు, హౌసింగ్ ఈఈలతో సదస్సు నిర్వహించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్ణయించారు. కానీ, కార్యక్రమం ప్రారంభ సమయంలో నేదునూరు ఎంపీటీసీ ఇండుగుల వెంకట్రామయ్య లేచి మేము ప్రజా ప్రతినిధులం కాదా అంటూ ప్రశ్నించడంతో సర్పంచ్ లను, ఎంపీటీసీ‌లను కూడా వేదిక మీదకు రావాల్సిందిగా హౌసింగ్ డీఈ ఆహ్వానించారు.

అనంతరం కొద్దిసేపటికి సమావేశానికి విచ్చేసిన జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్ ను కూడా వేదిక మీదకు ఆహ్వానించారు. కానీ అక్కడ ఒక్క కుర్చీ లేకపోవడంతో ఆగ్రహంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇదేనా ప్రజా ప్రతినిధులకు మీరిచ్చే గౌరవం అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీనికి సభాద్యక్షులు ఎవరు అంటూ డీఈని ప్రశ్నించడంతో ఆయన పొరబాటున ఎంపీడీవో అని తెలిపారు. దీంతో జడ్పీటీసీతో పాటుగా మరికొందరు అధికార వైసీపీ నేతలు ఎంపీడీవోను టార్గెట్‌ చేస్తూ ఏకవచనంతో సంభోధిస్తూ రెచ్చిపోయారు. తనకు సంబంధం లేదని ఆమె చెబుతున్న వివరణను సైతం వినకుండా మూకుమ్మడిగా వేదిక వద్ద ఎంపీడీవోపై తీవ్ర స్వరంతో కేకలు వేస్తూ ఊగిపోయారు. సభావేదిక వద్ద తీవ్ర గందరగోళం సృష్టించారు అధికార పార్టీ నాయకులు. సభా నిర్వాహకులను వదిలేసి వేదిక వద్ద మహిళా అధికారిపై దుర్బాషలు ఆడారు నాయకులు.

ఒకానొక దశలో ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. చేసేదేమీ లేక ఆమె కన్నీటిపర్యంతమవుతూ వేదిక వద్ద నుంచి వెళ్లిపోయారు మహిళా ఎంపీడీవో. సభ వేదికపై నుండి వెళ్లిపోయి ఆఫీసులో కన్నీటి పర్యంతం అయ్యారు ఎంపీడీఓ విజయ. అనంతరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వేదిక వద్దకు రావడంతో విషయం సద్దుమణిగి కార్యక్రమం సజావుగా సాగింది..