Nellore Rains: నెల్లూరు జిల్లాలో వర్షాలు, వరదల బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం, పొంగిపొర్లున్న వాగులు వంకలు

Nellore Rains: నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల బీభత్సం నుంచి ఇంకా ప్రభుత్వం తేరుకోలేదు.. మళ్ళీ మూడు రోజులు భారీ..

Nellore Rains: నెల్లూరు జిల్లాలో వర్షాలు, వరదల బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం, పొంగిపొర్లున్న వాగులు వంకలు
Nellore Rains
Follow us

|

Updated on: Nov 30, 2021 | 8:16 AM

Nellore Rains: నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల బీభత్సం నుంచి ఇంకా ప్రభుత్వం తేరుకోలేదు.. మళ్ళీ మూడు రోజులు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనజీవనం స్థంభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభ వృష్టికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడిక్కడ చెరువు కట్టలు తిరిగిపోయాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు.

పెన్నా, కాలంగి, స్వర్ణముఖి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.  కలుజులు..గూడూరు వద్ద జాతీయ రహదారిపై భారీగా  వరదనీరు చేరుకోవడంతో టాఫిక్ ఆగిపోయి ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. దీంతో  బలేరు వాగు..నెల్లూరు – తిరుపతి మధ్య వాహనాలను దారి మల్లింకాహారు. మరోవిప్పు మనుబోలు వద్ద పొలాల్లో చిక్కుకున్న కూలీలను   ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా కరకట్ట కోత గురై భారీ వరద నీరు చేరుకోవడంతో.. వరద ఉధృతికి ఇల్లులు కొట్టుకుపోయాయి. ఇక మరికొన్ని ఇల్లుల్లు కూలడానికి రెడీగా ఉన్నాయి. సోమశిల జలాశయంలోని భారీగా ఎగువ ప్రాంతాలను నుంచి వరద నీరు చేరుతుంది. మరోవైపు వైపు పెన్నా నదినుంచి కిందకు  లక్ష 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. పెన్నా పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో 107.9 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.

Also Read:   మీ ఫేస్‌రైట్స్ రూ.1.5 కోట్లు.. ఫేస్‌తో చిట్టి రోబోని తయారుచేస్తామంటున్న కంపెనీ.. ఎలా అప్లై చేయాలంటే..