Andhra Pradesh: విశాఖ జిల్లాలో బురద జాతరకు ఘనంగా ఏర్పాట్లు.. ఈ జాతర స్పెషల్ ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..!
Andhra Pradesh - Burada Panduga: విశాఖ జిల్లాలోని వింత జాతరకు వేళయింది. మొన్న వెదుళ్ళ పండగ, నేడు బురదమాంబ పండుగ జరుగనుంది. దిమిలిలో బురదమాంబ సంబరం మంగళవారం ఉదయం
Andhra Pradesh – Burada Panduga: విశాఖ జిల్లాలోని వింత జాతరకు వేళయింది. మొన్న వెదుళ్ళ పండగ, నేడు బురదమాంబ పండుగ జరుగనుంది. దిమిలిలో బురదమాంబ సంబరం మంగళవారం ఉదయం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని రీతిలో విచిత్రంగా ఉంటుంది ఈ జాతర. యలమంచిలి నియోజకవర్గం.. రాంబిల్లి మండలంలో కొలువుదీరిన ఈ దిమిలి గ్రామ దేవత దల్లమాంబ అనుపు మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో బురదమాంబ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు బురదమాంబ జాతర జరుగుతుంది. ఇక సోమవారం అర్ధరాత్రి నుంచే జాతర కోలాహలం కనిపిస్తుంది. ఈ జాతరలో పురుషులంతా వేపకొమ్మలు చేత పట్టుకొని.. మురుగుకాలువల్లోని బురదలో వేపకొమ్మలు ముంచి ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొట్టడం ఈ ఉత్సవాల ప్రత్యేకత.
బురద పూసుకున్నా ఎటువంటి చర్మ వ్యాధులు సోకకుండా ఉండటం అమ్మవారి మహత్యంగా గ్రామస్తుల నమ్మకం. అనంతరం ఆ కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి పూజలు చేస్తారు. ఘనంగా అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. అయితే, మహిళలకు మాత్రం బురద జల్లుకోవడం నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక ఇక్కడి అమ్మవారి విగ్రహం బురదలో లభించింది కాబట్టి ఆమెను బురదమాంబగా పిలుస్తారు అని గ్రామస్తులు అంటున్నారు.
Also read:
Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..