Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Deepotsavam: విశాఖలో టీటీడీ మహా దీపోత్సవం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన స్వరూపనందేంద్ర సరస్వతి..

TTD Deepotsavam: వేదం బతికి ఉందంటే అది వెంకటేశ్వ స్వామి మహిమే అని అన్నారు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. వేదాన్ని పోషిస్తుంది ఒక్క తిరుమల తిరుపతి

TTD Deepotsavam: విశాఖలో టీటీడీ మహా దీపోత్సవం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన స్వరూపనందేంద్ర సరస్వతి..
Swarupanadendra
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2021 | 7:00 AM

TTD Deepotsavam: వేదం బతికి ఉందంటే అది వెంకటేశ్వ స్వామి మహిమే అని అన్నారు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. వేదాన్ని పోషిస్తుంది ఒక్క తిరుమల తిరుపతి వెంకన్న మాత్రమే నని చెప్పారు. టిటిడి ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించిన దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వరూపనందేంద్ర పాల్గొన్నారు. తొలి దీపాన్ని స్వరూపనందేంద్ర వెలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్వరూపనందేద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరంలో మహాదిపోత్సవం జరిపించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించినా అది కుదరలేదన్నారు. పరమేశ్వరుడు ఈ కార్యక్రమం విశాఖలో జరపాలని నిర్ణయించారు అని న్నారు. ‘‘వేదం బతికి ఉందంటే అది వెంకటేశ్వ స్వామి మహిమే. వేదాన్ని పోషిస్తుంది ఒక తిరుమల తిరుపతి వెంకన్న మాత్రమే. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా వేదాన్ని పోషిస్తుంది ఒక్క టీటీడీనే. జీవితంలో ఒక్క సారైనా వెంకటేశ్వస్వామిని చుస్తే జన్మ ధన్యమవుతుంది. వేదం నిలబడితేనే ధర్మం నిలబడుతుంది. వెంకన్న కృప రాష్ట్రానికి దేశానికి కలగాలనే మహా దిపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెంకన్న మహిమ విశాఖ మీద ఉంది కాబట్టే ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం గొప్పగా జరిగింది.’’ అని స్వరూపనందేద్ర సరస్వతి అన్నారు.

కాగా, టిటిటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ నగరంలో కార్తీక జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామి వారి కృప వలన ఈ కార్యక్రమం నిర్వహించగలిగామన్నారు. బెంగుళూరు, తిరుపతిలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నా వాతావరణం అనుకూలించక పోవడం వలన అది కుదరలేదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. హైందవ సంప్రదాయం కాపాడేలా గుడికోక గోవు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సీఎం ఆదేశాలు మేరకు ప్రతి దేవాలయంలో గో పూజ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫిబ్రవరి రెండవ వారంలో నగరంలో టీటీడీ దేవాలయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..

Twitter Gets New CEO – Parag Agrawal: భార‌తీయుడికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు..

Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..