- Telugu News Spiritual December 2021 festival calendar: Vivah Panchami to Vaikuntha Ekadashi, check out the important dates
December 2021 Festivals: డిసెంబర్ నెలలో వచ్చే హిందువు పండగలు, వ్రతాలు.. వివరాలు మీకోసం
December 2021 Festivals: ఇంగ్లీషు క్యాలెండర్‌లో డిసెంబర్ నెల.. సంవత్సరం చివరి నెల. హిందూ మాసం మార్గశిరమాసం కూడా ఈ నెలలోనే వస్తుంది. ప్రతి నెలలాగే ఈ మాసంలోనూ అనేక ఉపవాసాలు, పండుగలు వస్తాయి. ముఖ్యంగా వివాహ పంచమి, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి వంటి పండగలకు ప్రసిద్ధి. డిసెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు..
Updated on: Nov 30, 2021 | 2:07 PM

ఈ నెల 2వ తేదీన మాస శివరాత్రి వస్తుంది అంతేకాదు ఇదేరోజు శివుడిని పూజిస్తూ ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ నెలలో డిసెంబర్ 2, డిసెంబర్ 17 తేదీల్లో భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కోరికలు తీర్చే వ్రతంగా భక్తులు భావిస్తారు.

డిసెంబర్ 4వ తేదీన మార్గశిరం అమావాస్య.. ఈరోజున పెద్దలకు కర్మలను నివహించడం.. పుణ్య నదుల్లో స్నానమాచరించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈనెల 8వ తేదీన వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు సీతారాముల కళ్యాణం జరిగిందని భక్తుల విశ్వాసం. ఈరోజున పెళ్లికానివారు వ్రతాన్ని ఆచరిస్తే.. మంచి ఫలితం ఉంటుందని భావిస్తారు.

ఈనెల 14న హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది గీత 5158వ వార్షికోత్సవం జరగనుంది. అంతేకాదు మోక్ష ఏకాదశి గా భావించి విష్ణుమూర్తిని పూజిస్తారు.

ఈనెల 19న మార్గశిర మాసం పున్నమి వచ్చింది. ఈరోజున ప్రజలు ఉపవాసం ఉంటారు, అలాగే పవిత్ర నదులలో స్నానంచేసి దానం వంటి కార్యక్రమాలని నిర్వహిస్తారు. అంతేకాదు ఎక్కువమంది హిందువులు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.

ఈ నెల సంకష్ట చతుర్థి డిసెంబర్ 22 బుధవారం వచ్చింది. ఈరోజు గణేశుడిని పూజిస్తారు. పగలు ఉపవాసం ఉంది.. రాత్రి చంద్రుడి దర్శానఁ చేసుకున్న తర్వాత ఆహారం తీసుకుంటారు. ఇలా చేయడంవలన జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం

పుష్యమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీన వస్తుంది. ఈరోజు విష్ణువుని పూజిస్తూ వ్రతాన్నిఆచరించడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులతో భక్తుని కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.




