Zodiac Signs: ఈ 3 రాశులవారు జంతు ప్రేమికులు.. వాటికి ఆహారం పెట్టకపోతే రోజు గడవదు.!
మీరెప్పుడైనా రద్దీగా ఉండే రోడ్డుపై ఆకలితో ఉన్న కుక్కపిల్లకు ఆహారం ఇవ్వడానికి ఆగారా.? లేదా మధ్యాహ్నం సమయంలో...
మీరెప్పుడైనా రద్దీగా ఉండే రోడ్డుపై ఆకలితో ఉన్న కుక్కపిల్లకు ఆహారం ఇవ్వడానికి ఆగారా.? లేదా మధ్యాహ్నం సమయంలో మీ లంచ్‌ని స్కిప్ చేసి వాటికి పెట్టారా.? చాలామంది ఈ పనులు చేయరు. ఎందుకంటే.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి సమయం ఉంది. పనుల ఒత్తిడి కారణంగా కొంతమంది తమ భోజనాన్నే మర్చిపోతున్నారు.
అయితే జంతు ప్రేమికులు కూడా కొంతమంది ఉన్నారు. వాటిని మనుషుల మాదిరిగానే ప్రేమిస్తారు. వాటి కోసం ఆహారం తీసుకురావడం.. కంటికి రెప్పలా చూసుకోవడం లాంటిది చేస్తుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ 3 రాశులవారు జంతు ప్రేమికులు.. వీరికి జంతువులంటే చాలా ఇష్టం. అవి ఏయే రాశులో చూద్దాం పదండి.!
మకరరాశి:
ఈ రాశివారు జంతు ప్రేమికులు. జంతువులకు సహాయం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు. వీరి ఫస్ట్ లవ్ ఎలప్పుడూ జంతువులే. వీరికి కుక్కలు, పిల్లులంటే ఇష్టం. వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. అలాగే ఈ అమాయకపు ప్రాణాలకు చేయాల్సినంత చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు.
సింహరాశి:
ఈ రాశివారికి జంతువులంటే భయం. అలా అని వాటికి సాయం చేయరని కాదు. చేయకుండా ఉండలేరు. ఆహారం, నీళ్లు, ఆశ్రయం.. ఇలా ఏదైనా కూడా జంతువులకు సాయం చేసేందుకు ఈ రాశివారు అన్ని విధాల ప్రయత్నిస్తారు. అంతేకాకుండా జంతువులను దత్తత తీసుకోవాలని ఆలోచిస్తారు. కాని వారి భయం కారణంగా.. ఈ ఆలోచనను విరమించుకుంటారు.
మిధునరాశి:
ఈ రాశివారు జంతువులకు భయపడరు. వాటిని దత్తత తీసుకోవాలని అనుకుంటారు. వీరు జంతు ప్రేమికులు. జంతువులతో బాగా కలిసిపోతారు. వాటిని ప్రేమగా చూసుకుంటారు. ఇంటికి ఎలప్పుడూ ఓ కొత్త పెంపుడు జంతువును తీసుకొస్తారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.
ఇవి కూడా చదవండి:
Viral Photos: అగ్గిపెట్టె లాంటి చిన్న ఇల్లు.. లోపల చూస్తే మైండ్ బ్లాకే.. ఫోటోలు వైరల్!
Zodiac Signs: ఈ 5 రాశులవారికి పెళ్లికి తొందరెక్కువ.. ఎన్నో కలలు కంటారు.! అందులో మీరున్నారా..