Kangana Ranaut: ట్విట్టర్‌ సీఈఓ మార్పుపై తనదైన శైలిలో స్పందించిన కంగనా.. ఏమన్నారంటే..

Kangana Ranaut: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ సీఈవోను మారుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సీఈవో బాధ్యతలు వహిస్తున్న ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు...

Kangana Ranaut: ట్విట్టర్‌ సీఈఓ మార్పుపై తనదైన శైలిలో స్పందించిన కంగనా.. ఏమన్నారంటే..
Kangana Twitter

Kangana Ranaut: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ సీఈవోను మారుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సీఈవో బాధ్యతలు వహిస్తున్న ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తప్పుకుంటున్న ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్‌ అగర్వాల్‌ ఈ అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడంతో భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే పరాగ్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కూడా సీఈవో మార్పుపై తనదైన శైలిలో స్పందించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ట్విట్టర్ సీఈవో మార్పును ప్రస్తావిస్తూ.. ‘బై చాచా జాక్‌’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే కంగానా ఇలా ఫన్నీగా స్పందించాడినిక కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. గతంతో ఈ తార వివాదాస్పద ట్వీట్‌ చేసిందన్న కారణంతో ట్విట్టర్‌ కంగనా అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో కంగనా ట్వి్ట్టర్‌పై ఓరేంజ్‌లో ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఈవోగా ఇండియన్‌ బాధ్యతలు చేపట్టడంతో తనదైన శైలిలో స్పందించారు కంగనా.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

ఇదిలా ఉంటే తనకు ప్రాణహాని ఉందంటూ కంగానా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మరో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా తెలిపింది. పంజాబ్‌ ప్రభుత్వం తన ఫిర్యాదును స్వీకరించి త్వరగా చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి బెదిరింపులకు తాను ఎప్పటికీ భయపడనని, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారిపై తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడుతానని తేల్చి చెప్పిందీ బ్యూటీ.

Also Read: Viral Video: బంగారం పూతతో బర్గర్‌.. ఉచితంగా రుచి చూసే అవకాశం.. ఎక్కడంటే..

Crime News: తిరుమలగిరి కారులో మృతదేహం కేసులో మరో ట్విస్ట్.. బయటకు వస్తున్న సంచలన విషయాలు!

Afghanistan – Taliban: తాలిబాన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. జైలులో ఉన్న 210 మంది ఖైదీల విడుదల


Published On - 12:31 pm, Tue, 30 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu