Crime News: తిరుమలగిరి కారులో మృతదేహం కేసులో మరో ట్విస్ట్.. బయటకు వస్తున్న సంచలన విషయాలు!

హైదరాబాద్‌ తిరుమలగిరి డెడ్‌ బాడీ మిస్టరీ వీడింది. కారులో కలకలం రేపిన డెడ్ బాడీ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యగా తేల్చారు.

Crime News: తిరుమలగిరి కారులో మృతదేహం కేసులో మరో ట్విస్ట్..  బయటకు వస్తున్న సంచలన విషయాలు!
Suspected Death
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 30, 2021 | 10:58 AM

Dead body in Car Case: హైదరాబాద్‌ తిరుమలగిరి డెడ్‌ బాడీ మిస్టరీ వీడింది. కారులో కలకలం రేపిన డెడ్ బాడీ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యగా తేల్చారు. కారులో రక్తపు మరకలు, మృతదేహంపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గురైంది ఎవరో తేలింది? మరి, చంపిందెవరు? అన్నదానిపై పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్ మహానగరంలోని అల్వాల్ పెద్ద కమేళాలో ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో కారులో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మరణించాడు. అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. తిరుమలగిరి పెద్ద కమేళ ఆర్టీసీ కాలనీ ప్రధాన రహదారిలో మిలిటరీకి సంబంధించిన ఖాళీ స్థలంలో పార్కు చేసిన కారులో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు అల్వాల్‌కి చెందిన విజయ భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. క్లూస్ టీం సహాయంతో మరణించిన వ్యక్తి నుండి ఆధారాలు సేకరించారు.

అల్వాల్ ప్రాంతానికి చెందిన విజయ్‌ భాస్కర్‌రెడ్డి(50) ఇంటి నుంచి బయటకు వెళ్లి విగతజీవిగా మారడం కలకలం రేపుతోంది. నోరు ముక్కు వద్ద గాయాలు కావడం, చెవి వెనుక భాగం నుండి రక్తస్రావం జరుగుతుండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విజయ భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. అతను చనిపోవడానికి ఆస్తి తగాదాలే కారణమా లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయ భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విజయ భాస్కర్ రెడ్డి మృతి పట్ల పలు అనుమానాలు రేకెత్తిస్తుండటంతో రాచకొండ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కారులో ఉన్న వ్యక్తి మృతిచెందాడని, అతడు అల్వాల్‌కు చెందిన విజయ్‌ భాస్కర్‌రెడ్డి అని గుర్తించారు. మృతుడి ముక్కు, నోట్లోంచి రక్త స్రావం జరగడంతో పాటు చెవి వెనుక భాగంలో చిన్న గాయం ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని సందర్శించి బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డి పరిశీలించగా, క్లూస్‌ టీం పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతుడు విజయ్ కుమార్ సమీప బంధువు నరేందర్ రెడ్డితో వివాదాలు ఉన్నట్టు మృతుడి భార్య అనుమానం వ్యక్తం చేసింి. సంఘటన స్థలానికి 200మీటర్ల దూరంలో విజయ్ కుమార్‌కు సంబంధించి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌ను చంపేసి కారులో పడేసినట్లు సీన్‌ ఆఫ్ అఫెన్స్‌ను బట్టి తేల్చారు. భాస్కర్‌రెడ్డి, అతని బంధువుల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడం అనుమానాలకు తావిస్తోంది.

Read Also…  MPDO shed Tears: మహిళా అధికారిణిపై అధికార పార్టీ నేతల జులుం.. కన్నీరు పెట్టిన ఎంపీడీఓ!