Hair Loss: శరీరంలో ఇవి లోపిస్తే బట్టతల వచ్చేస్తుంది..! ఏంటో తెలుసుకోండి..?

Hair Loss: ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అనేది జన్యుపరమైన వ్యాధి. దీని కారణంగా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. చివరకు బట్టతల వచ్చేస్తుంది.

Hair Loss: శరీరంలో ఇవి లోపిస్తే బట్టతల వచ్చేస్తుంది..! ఏంటో తెలుసుకోండి..?
Bald
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:19 PM

Hair Loss: ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అనేది జన్యుపరమైన వ్యాధి. దీని కారణంగా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. చివరకు బట్టతల వచ్చేస్తుంది. అయితే జుట్టు రాలడం వెనుక వంశపారంపర్య కారణాలు కూడా ఉంటాయి. కానీ ప్రతిసారీ ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల మాత్రం రాదని తెలుసుకోండి. జుట్టు రాలడం లేదా బట్టతల రావడం అనేది మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి జన్యుపరమైన సమస్య కాదని సైన్స్ చెబుతోంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొన్ని అవసరమైన మూలకాలు లేకపోవడమే. కానీ ఆ మూలకాల లోపం వంశపారంపర్యంగా ఉంటుంది. వారసత్వం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అయిన జన్యువులది మాత్రమే కాదు. బదులుగా కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది.

1. జింక్ ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలోని ప్రజల శరీరంలో జింక్ కొరత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. జింక్ లోపం శ్వాసకోశ వ్యవస్థ, చర్మానికి సంబంధించిన వ్యాధులను మాత్రమే కలిగిస్తుంది. జింక్ లోపం ప్రధాన లక్షణం జుట్టు వేగంగా రాలడం. మీ జుట్టు అకస్మాత్తుగా రాలడం ప్రారంభించిందని మీకు అనిపిస్తే అది జింక్ లోపం వల్ల కావచ్చు. జింక్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు.

2. బయోటిన్ బయోటిన్ అనేది జుట్టుకు అవసరమైన మూలకం. ఇది లేకపోవడం వల్ల జుట్టు పలుచబడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు కూడా విరిగిపోతాయి. కండరాల అలసట, బలహీనత, మైకము, కాళ్ళలో తిమ్మిరి వంటివి బయోటిన్ లోపం లక్షణాలు. ఇది శరీరానికి అవసరమైన మూలకం. కానీ జుట్టు, గోళ్లకు ఇది చాలా ముఖ్యమైనది.

3. రాగి సాధారణంగా శరీరంలో రాగి లోపం ఉండదు. కానీ ఏదైనా కారణం వల్ల అది లోపిస్తే జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా భారతదేశం వంటి దేశంలో శరీరంలో కాపర్ సమస్య ఉండదు. కాని ఇది లోపిస్తే మోకాలు, కీళ్లలో భరించలేని నొప్పి ఉంటుంది.

4. కొల్లాజెన్ కొల్లాజెన్ అనేది జుట్టు మూలాలను బలపరిచే మూలకం. ఇది జుట్టుని మందం చేస్తుంది. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడుతుంది. ఎక్కువగా ఊడిపోతుంది.

5. విటమిన్ B6 జుట్టుకి విటమిన్ B కాంప్లెక్స్ చాలా ముఖ్యం. దీని లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. విటమిన్ బి6 మన జుట్టు ఆరోగ్యానికి సంబంధించినది. ఈ విటమిన్ లోపం ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా మారుతుంది. ఎక్కువగా ఊడిపోయి బట్టతల వస్తుంది.

Realme 9 సిరీస్ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్లు.. జనవరిలో ప్రారంభించే అవకాశం..

Pensioners: పెన్షన్ పొందడం ఇప్పుడు చాలా సులభం..! ఏ పత్రాలు అవసరం లేదు..

Paytm: పేటీఎం నయా సేవలు.. ఒక్క కార్డు అన్ని పనులు.. వన్‌ నేషన్‌ వన్‌ కార్డ్‌

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?