Pumpkin Seeds Benefits: డయాబెటిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఈ గింజలు తినండి.. మధుమేహం అదుపులోకి తెచ్చుకోండి..

జీవితాంతం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం మధుమేహ బాధితుల్లో చాలా ముఖ్యమైన పరిస్థితి. ఇందులో మీరు తినే , త్రాగే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అధ్యయనాలు గుమ్మడికాయ గింజలు మధుమేహంలో చక్కెర స్థాయిని వేగంగా తగ్గించగలవని పేర్కొన్నాయి.

Pumpkin Seeds Benefits: డయాబెటిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఈ గింజలు తినండి.. మధుమేహం అదుపులోకి తెచ్చుకోండి..
Pumpkin Seeds Benefits
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 30, 2021 | 11:27 AM

జీవితాంతం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం మధుమేహ బాధితుల్లో చాలా ముఖ్యమైన పని. ఇందులో మీరు తినే.. త్రాగే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం మధుమేహంలో చక్కెర స్థాయిని వేగంగా తగ్గించడంలో గుమ్మడికాయ గింజలు  సహాయ పడుతాయని తేలింది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు మధుమేహ వ్యాధి ఒక వ్యక్తిని చుట్టుముడుతుంది. ఇది చక్కెరను శక్తిగా మార్చడానికి పనిచేసే హార్మోన్. అటువంటి పరిస్థితిలో శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి పెరగడం మొదలవుతుంది. దీని కారణంగా శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతింటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి ఉపయోగపడే ఈ వ్యాధిలో కొన్ని విషయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రక్తంలో చక్కెరను సరిగ్గా ఇన్సులిన్‌గా మార్చడంలో గుమ్మడికాయ గింజలు అద్భుతంగా పని చేస్తాయి. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. గుమ్మడికాయ గింజల్లో పాలీశాకరైడ్స్ అనే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉన్నట్లు కనుగొనబడింది. మనుషులు, జంతువులపై గుమ్మడికాయ గింజలు ఉత్తమ ప్రభావాన్ని చేపినట్లుగా వారి అధ్యయనాల్లో వెల్లడైంది.

శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుమ్మడి గింజలలో కనిపిస్తాయి. దీని గింజలు ప్రోటీన్, కొవ్వుతో నిండి ఉంటాయి. 2018 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 50 గ్రాముల గుమ్మడికాయ గింజలను తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని 35 శాతం నియంత్రించవచ్చని తేలింది. గుమ్మడికాయ గింజలలో ఉండే మెగ్నీషియం దానిని మరింత శక్తివంతం చేస్తుందని వారి పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది. మెగ్నీషియం మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వారి అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం గుమ్మడి గింజలు… తృణధాన్యాలు, గింజలు, పచ్చి ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవచ్చు. గుమ్మడి గింజల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.

ప్రయోజనాలు మరెన్నో –

గుమ్మడికాయ గింజలలో ఉండే విటమిన్-ఇ కెరోటినాయిడ్స్ కూడా శరీరంలోని వాపు నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. గుమ్మడి గింజలు లేదా నూనె శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి: Leptin and Obesity: మీలో ఈ హార్మోన్లు పనిచేయకపోతే డయాబెటిస్ వచ్చినట్లే.. అవేం చేస్తాయో తెలుసా..

Kishan Reddy: ఆయన మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..