Amla Health Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!

Amla Health Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!

Amla Health Benefits: ప్రస్తుత జీవనశైలి కారణంగా అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని కొన్ని పద్దతులు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు...

Subhash Goud

|

Nov 29, 2021 | 9:51 PM

Amla Health Benefits: ప్రస్తుత జీవనశైలి కారణంగా అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని కొన్ని పద్దతులు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. సాధారణంగా మనకు దొరికి పండ్లను తీసుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చు. ఇక ఉసిరికాయతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం వల్ల పలు వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ఉసిరిలో విటమిన్‌ -సి ఎంతో మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని నిరోధించడానికి, జలుబు లేదా దగ్గును నివారించడానికి ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మధుమేహం వ్యాధులున్నవారికి..

ఉసిరి మలబద్దకం, మధుమేహం వంటి వ్యాధులున్నవారికి ఎంతో మేలని, ఎన్నో రకాల వ్యాధులను తగ్గించేందుకు ఉసిరికాయ ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఉసిరి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రించబడతాయి. ఉసిరి తినడం వల్ల చర్మ సమస్యలు, జట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందులో సి విటమిన్ ఉండటం వల్ల చర్మ వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.

ఉసిరిలో పోషకాలు ఎక్కువే..

ఉసిరిలో నారింజ పండ్ల కన్నా 20 శాతం ఎక్కువ విటమిన్‌ పోషకాలు ఉంటాయి. ఉసిరి చర్మపు ముడుతలను సైతం నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. మన తరచూ ఉసిరిని తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఇలా కూడా తింటే మంచిదే..

మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేము కాబట్టి, దీనిని ఆహారంలో ఉడకబెట్టడం లేదా పచ్చడి చేయడం ద్వారా తినవచ్చు. తేనెతో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్యులు.

చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రణ..

ఉసిరి జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సైతం నియంత్రించుకోవచ్చు. ఇది శరీర బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, ఈ రసం రోజూ తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను తొలగించుకోవచ్చు. అలాగే ఉసిరి రసం చర్మంపై నల్లటి మచ్చలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖం మీద ఉసిరి రసం ఉంచడం వల్ల రంధ్రాలు పోతాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఉసిరి రసం తాగడం మంచిది. ఉసిరి రసం కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

మొటిమల నివారణకు..

మొటిమల నివారణకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఉసిరికాయ పొడిని మిక్స్ చేసి ముఖానికి అద్దుకోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. ఉసిరికాయ రసాన్ని తేనె తో కలిపి తీసుకుంటే మిలమిలా మెరిసే చర్మం మీ సొంతం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జుట్టు ఒత్తిగా పెరిగేందుకు..

జుట్టు ఎత్తుగా పెరిగేందుకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఉసిరికాయ రసంతో మసాజ్ చేస్తే చుండ్రు కూడా పోతుందని చెబుతున్నారు. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇక ఉసికి కాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల మూత్రనాళ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సామాన్యులకు తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే ఈ ఉసిరిలో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

(నోట్‌: ఈ అంశాలన్ని ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాలను బట్టి అందించడం జరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించి సలహాలు, సూచనలు పొందాలి.)

ఇవి కూడా చదవండి:

Hand Numbness: మీకు అలాంటి సమయంలో తిమ్మిర్లు వస్తున్నాయా..? ప్రమాదమే.. వైద్యులను సంప్రదించండి..!

వైరస్‌లు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి..? ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్‌.. గుర్తించని వైరస్‌లు మరెన్నో..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu