Hand Numbness: మీకు అలాంటి సమయంలో తిమ్మిర్లు వస్తున్నాయా..? ప్రమాదమే.. వైద్యులను సంప్రదించండి..!

Hand and Finger Numbness: మన శరీరంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల మనకు ముందస్తుగా తెలిసిపోతుంది. ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా ఎన్నో రోగాలు చుట్టు ముడుతున్నాయి...

Hand Numbness: మీకు అలాంటి సమయంలో తిమ్మిర్లు వస్తున్నాయా..? ప్రమాదమే.. వైద్యులను సంప్రదించండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2021 | 1:44 PM

Hand and Finger Numbness: మన శరీరంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల మనకు ముందస్తుగా తెలిసిపోతుంది. ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా ఎన్నో రోగాలు చుట్టు ముడుతున్నాయి. కొన్ని నిర్లక్ష్యం పనుల వల్ల మరింత ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. సాధారణంగా మన శరీరంలో ఏదో ఒక భాగంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. ఆ భాగంలో నరాలకు మెదడు నుంచి సంకేతాల సరఫరా అవుతూ ఉంటుంది. చేతులకు తిమ్మిర్లు వచ్చాయంటే దాని అర్థం మెడ నుంచి చేతిలోకి ఆ భాగానికి వెళ్లే నరాల సరఫరా ఆగిపోతుందని అర్థం. అంటే.. ఆ నరాలు బలవంతంగా నొక్కుకుపోతే.. వాటి నుంచి సంకేతాల సరఫరా చెయ్యికి ఆగిపోతుంది. నరాలకు స్వయంగా రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. నరంపై ఒత్తిడి పడినప్పుడు.. రక్తం సరఫరా ఆగిపోతుంది. దాంతో చెయ్యికి ఆక్సిజన్, పోషకాలు అందడం నిలిచిపోతుంది. దాంతో చెయ్యి చచ్చుబడినట్లు అవుతుంది. దాన్ని మనం ముట్టుకుంటే కూడా మనకు స్పర్శ తెలియదు. మనం నిద్ర లేచాక.. నరంపై ఒత్తిడి పోయి రక్త సరఫరా మొదలై చెయ్యికి ఉన్న తిమ్మిర్లు పోతాయి.

రోజుల తరబడి తిమ్మిర్లు వస్తుంటే..

ఇలా ఐదు నిమిషాల్లో తిమ్మిర్లు తగ్గకపోతే మనం ఎలాంటి ఖంగారు పడాల్సిన అవసరం లేదు. కొంత మందికి అలా జరగదు. రోజుల తరబడి తిమ్మిర్లు అలాగే వస్తుంటాయి. అంటే దాని అర్థం.. చెయ్యికి రక్తాన్ని సరఫరా చేసే నరాలు దెబ్బతిన్నాయని అర్థం. అలాంటి వారికి రాత్రిళ్లు పడుకొని లేచాక తరచూ చేతులు తిమ్మిర్లు అవుతూనే ఉంటాయి. ఇలాంటి వారు సెర్వికల్ MRI చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా జరుగకుండా ఉండాలంటే రాత్రివేళ నిద్రపోయే సమయంలో మెడను పద్దతిగా ఉంచుకోవాలి. కళ్లు ఆకాశంవైపు చూస్తున్నట్లుగా, పొట్ట ఆకాశం వైపు ఉన్నట్లుగా పడుకుంటే మెడ దగ్గర నుంచి వెళ్లే నరాలు దెబ్బతినకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు కూర్చుంటున్నారా..?

నిద్రించే సమయంలోనే కాకుండా ఎక్కువ సేపు కంప్యూటర్‌ దగ్గర కూర్చున్నా.. భుజాల దగ్గర నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనినే థొరాసిక్‌ ఔట్లెట్‌ సిండ్రోమ్‌ (Thoracic outlet syndrome) అంటారు. కూర్చున్నప్పుడు తల ముందుకు వస్తూ ఉంటుంది. అప్పుడే నరాలు దెబ్బతింటాయి. భుజాల ఎక్సర్‌సైజులు చెయ్యడం ద్వారా సమస్య రాకుండా నివారించవచ్చు. లేదా.. మధ్య మధ్యలో పనికి గ్యాప్ ఇచ్చి అటూ ఇటూ నడవాలి. ఇక అప్పటికీ తిమ్మిర్లు తరచూ వస్తూ ఉంటే.. వైద్యున్ని సంప్రదించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఆ నరం దెబ్బతింటే తిమ్మిర్ల సమస్య..

అలాగే నడుం దగ్గర అసలైన చెయ్యికి సంబంధించిన నరం దెబ్బ తింటే కూడా తిమ్మి్ర్ల సమస్య వస్తుంది. దీన్నే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (carpal tunnel syndrome) అంటారు. నడుం నుంచి ఈ టన్నెల్ లాంటిది వెళ్తుంది. ఇలాంటి సమస్య వల్ల తిమ్మిర్లు వస్తున్నాయని అనిపిస్తే.. వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. పదేపదే తిమ్మిర్లు వస్తుండటం, లేదా తెల్లారి లేచాక తరచూ తిమ్మిరులు వస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

(గమనిక: ఈ ఆర్టికల్‌లోని అంశాలు వివిధ సందర్భాల్లో నిపుణులు చెప్పిన ప్రాథమిక సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుడైన వైద్యుడిని లేదా ఏదైనా రంగంలో నిపుణుడిని సంప్రదించడం మంచిది.)

ఇవి కూడా చదవండి:

వైరస్‌లు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి..? ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్‌.. గుర్తించని వైరస్‌లు మరెన్నో..!

Curd: మీకు పెరుగు తినే అలవాటు ఉందా..? ఈ ఐదు పదార్థాలతో కలిపి తింటే ప్రమాదమేనట..!

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు