Curd: మీకు పెరుగు తినే అలవాటు ఉందా..? ఈ ఐదు పదార్థాలతో కలిపి తింటే ప్రమాదమేనట..!

Curd: ప్రస్తుతమున్న మన జీవన శైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం అదుపులో ఉంటుంది. కొన్ని..

Curd: మీకు పెరుగు తినే అలవాటు ఉందా..? ఈ ఐదు పదార్థాలతో కలిపి తింటే ప్రమాదమేనట..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2021 | 7:56 AM

Curd: ప్రస్తుతమున్న మన జీవన శైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం అదుపులో ఉంటుంది. కొన్ని చిన్నపాటి పొరపాట్ల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ అవి మన పెద్దగా పట్టించుకోము. తినే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక అందరికి ఎంతో ఇష్టమైనది పెరుగు. పెరుగు తినడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పెరుగులో కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే పెరుగుని మనం ఎక్కవగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం. అయితే పెరుగు కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

మామిడి: పెరుగును మామిడి పండుతో కలిపి ఎప్పుడు తినకూడదు. అలా కలిపి తినడం వల్ల శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఈ రెండు కలిపి తినడం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మామిడి పండు, పెరుగు కలిపి తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఉల్లిపాయలతో కలిపి పెరుగు.. ఉల్లిపాయలతో కలిపి పెరుగు తినడం అంత మంచిది కాదు. ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే, పెరుగు చల్లదనానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్‌, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పాలు, పెరుగు: ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. రెండు తెల్లగానే ఉన్నా.. సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు కలిపి తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

చేపలతో పెరుగు: పెరుగు, చేపలు ఈ రెండింటిలో ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్‌ సమస్య వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

నెయ్యి, నూనెతో వేయించిన పదార్థాలతో.. నెయ్యి, నూనెతో వేచించిన పదార్థాలతో పెరుగు కలుపుకొని తింటే కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలా వేయించిన పదార్థాలతో పెరుగు కలిపి తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. నిరసంగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Plastic: ప్లాస్టిక్‌తో ప్రమాదం.. భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలుసా?

చలికాలంలో బెల్లం, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..