AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: ఈ శీతాకాలంలో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ఈ 5 లేజీ ట్రిక్స్‌తో సులువుగా బరువు తగ్గొచ్చు..!

Weight Loss: సాధారణంగా వాతావరణం కొంచెం చల్లగా అనిపిస్తే చాలు వెంటనే దుప్పటి కప్పి ముసుగేస్తారు చాలామంది. బద్దకంగా ఉంటారు. ముఖ్యంగా చలికాలం గురించి అయితే ప్రత్యేకంగా

Weight Loss Tips: ఈ శీతాకాలంలో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ఈ 5 లేజీ ట్రిక్స్‌తో సులువుగా బరువు తగ్గొచ్చు..!
Weight Loss
Shiva Prajapati
|

Updated on: Nov 28, 2021 | 6:35 AM

Share

Weight Loss: సాధారణంగా వాతావరణం కొంచెం చల్లగా అనిపిస్తే చాలు వెంటనే దుప్పటి కప్పి ముసుగేస్తారు చాలామంది. బద్దకంగా ఉంటారు. ముఖ్యంగా చలికాలం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బారెడు పొద్దెక్కినా నిద్ర లేవడానికి మనసు, శరీరం అంగీకరించవు గాక అంగీకరించవు. ఫలితంగా శారీరక శ్రమ స్థాయి తగ్గుతుంది. అంతేకాదు.. చలికాలంలో నచ్చిన ఫుడ్ తినాలనే కోరికలు బలంగా కలుగుతాయి. దాంతో నాన్ స్టాప్‌గా ఏదో ఒకటి లాగేంచేస్తుంటాం. ఇది ఫిట్‌నెస్‌ కోరుకునే వారికి, బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఆటంకంగా పరిణమిస్తుంది. అయితే, చలికాలంలోనూ, అందులోనూ బద్ధకంతోనూ బరువు తగ్గించుకునే సరికొత్త ఉపాయం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో కాస్త బద్ధకంగా ఉన్నా బరువు తగ్గవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా కాస్త తెలివిగా ఆలోచించడమే. శీతాకాలాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడం ఎలాగో మీకు తెలిస్తే ఎలాంటి శ్రమ లేకుండానే మీ శరీరం అద్భుతాలను సృష్టిస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారి కోసం ఇక్కడ 5 లేజీ ట్రిక్స్ ఉన్నాయి. ఈ శీతాకాలంలో వాటిని ప్రయత్నించండి.

1. కొంచెం వణుకు అవసరం.. చలి కారణంగా అందరికీ వణుకు వస్తుంది. ఫలితంగా చాలా మంది ఆ చలి ప్రభావాన్ని తట్టుకునేందుకు.. భారీ బందోబస్తు మాదిరిగా గరం కోటు, మఫ్లర్ వంటి ఫుల్‌గా ధరించి బయటకు వెళ్తారు. అయితే, ఇకపై అలా చేయొద్దు. శరీరానికి వణుకు చాలా అవసరం. ఎందుకంటే.. ఓ అధ్యయనం ప్రకారం 10 నుంచి 15 నిమిషాల పాటు వణుకు కారణంగా ఒక గంట పాటు విపరీతమైన వ్యాయామానికి సమానమైన కేలరీలు బర్న్ అవుతాయట. ఇది మాత్రమే కాదు.. మీ బరువును తగ్గిస్తుంది.

2. సమయానికి హెల్తీ ఫుడ్ తినాలి.. చలికాలంలో ప్రతీ ఒక్కరూ ఎక్కువగా తింటారు. చలి ఉష్ణోగ్రతలు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి రోజువారీ కేలరీల అవసరాలను పెంచుతాయి. ఫలితంగా ఇష్టం వచ్చినట్లు తింటుంటారు. అయితే, ఇలాంటి పరిస్థితులను కాస్త కంట్రోల్ చేసుకోండి. దానికి బదులుగా టైమ్‌కి తినడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మీరు తినే ఆహారంలో హెల్తీ, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోండి. ఫైబర్ చాలా సమయం వరకు మీ కడుపును నిండుగా ఉంచుతుంది. అన్ హెల్తీ ఫుడ్ తినాలనే కోరికను నిరోధిస్తుంది.

3. వేడి నీటిని వినియోగించకండి.. చాలా మంది ప్రజలు చల్లని కాలంలో వేడి నీటిని తాగడానికి ఇష్టపడతారు. వేడి నీటితోనే స్నానం చేస్తారు. అయితే, మీరు బరువు తగ్గాలనుకుంటే చన్నీటినే తాగాలి. అలాగే చన్నీటితోనే స్నానం చేయాలి. తద్వారా శరీరంలో కేలరీలు బర్న్ అవుతాయి. బాడీ టెంపరేచర్ కంటే చల్లగా ఉండే లిక్విడ్‌ని తాగడం వల్ల శరీరం వేడి అవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బరువును తగ్గించడానికి అవసరమైన చాలా కేలరీటు బర్న్ చేయబడతాయి.

4. హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ.. చక్కెర, పాలతో చేసిన సాధారణ కాఫీ, టీకి బదులుగా హెర్బల్ టీ, బ్లాక్ కాఫీని తీసుకోండి. ఊలాంగ్ టీ, మందార టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది.

5. ఎక్కువ ఇంటి పనుల్లో మునిగిపోండి.. మీరు వ్యాయామం కోసం బయటకు వెళ్లలేకపోతే.. ఇంట్లోనే శారీరక శ్రమలో పాల్గొనండి. క్లీనింగ్, వాషింగ్, మాపింగ్, గార్డెనింగ్ వంటి ఇంటి పనులను చేయడం ద్వారా మీరు చాలా కేలరీలు బర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే.. ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి మీ సీటు నుంచి లేచి కాసేపు నడవండి.

Also read:

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?