శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..
Coconut

Skin Care: ప్రపంచం మొత్తం మీద కాస్మోటిక్స్ మార్కెట్‌ ఒకటిన్నర వేల బిలియన్ డాలర్లు. ఇందులో అధిక భాగం నైట్ క్రీమ్‌ల విక్రయాలు మాత్రమే. అంటే రాత్రిపూట చర్మాన్ని

uppula Raju

|

Nov 27, 2021 | 7:54 PM

Skin Care: ప్రపంచం మొత్తం మీద కాస్మోటిక్స్ మార్కెట్‌ ఒకటిన్నర వేల బిలియన్ డాలర్లు. ఇందులో అధిక భాగం నైట్ క్రీమ్‌ల విక్రయాలు మాత్రమే. అంటే రాత్రిపూట చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి అప్లై చేసే క్రీములు. అయితే ఇలాంటి క్రీములలో ఏజింగ్ ఎలిమెంట్‌ను కలిపితే 40, 50 ఏళ్ల తర్వాత వృద్ధాప్యం ఆగిపోతుందని కంపెనీలు పేర్కొంటున్నాయి. చర్మాన్ని బట్టి వయస్సు గుర్తించలేరన్నమాట. ఈ ఖరీదైన సౌందర్య సాధనాల కోసం చాలామంది వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే అందంగా యవ్వనంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి.

అయితే ప్రపంచంలో బెస్ట్ నైట్ క్రీమ్ ఏ కంపెనీకి చెందినది కాదు. అంతేకాదు ఖరీదైన ఉత్పత్తి కూడా కాదు. అది కొబ్బరి నూనె అని తెలిస్తే షాక్‌ అవుతారు. చర్మం ఆరోగ్యంగా, లోపల నుంచి మెరుస్తూ ఉండటానికి అవసరమైన అన్ని గుణాలను కొబ్బరి నూనె కలిగి ఉంది. కృత్రిమ యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, ఉత్పత్తులు మన చర్మాన్ని బానిసలుగా చేస్తాయి వృద్ధాప్య వేగాన్ని పెంచుతాయి. ఈ యాంటీ ఏజింగ్ క్రీములను ఒక సంవత్సరం పాటు కంటిన్యూగా వాడితే చర్మం పాలిపోయి బలహీనంగా కనిపిస్తుంది. కాబట్టి కృత్రిమ క్రీములకు బదులు వీలైనంత వరకు సహజమైన వస్తువులనే వాడటం మంచిది.

కొబ్బరి నూనె వలె, ఆలివ్ లేదా అవకాడో నూనె కూడా చర్మానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది కొబ్బరి నూనె కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది మాత్రం కాదు. ఆలివ్ పండించే దేశాలకు ఇది మంచిది అలాగే మన దేశంలో కొబ్బరి పండిస్తున్నారు కాబట్టి అదే మనకు మంచిది. కొబ్బరిలో ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఇందులో ఉండే అమినో యాసిడ్‌లు త్వరగా చర్మంలోకి ఇంకుతాయి. చర్మం రంధ్రాలలోకి చొచ్చుకొనిపోయి లోపల నుంచి పోషణను అందిస్తుంది.

1985లో ముద్రించిన ఈ రూపాయికి 2.5 లక్షలు.. కానీ దానిపై ఈ గుర్తు ఉండాలి..

UPSC Recruitment 2021: యూపీఎస్సీలో ఫ్యాకల్టీ, ట్యూటర్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

LPG Subsidy: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. డిసెంబర్‌ నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ..! ఎవరికి లభిస్తుందంటే..?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu