UPSC Recruitment 2021: యూపీఎస్సీలో ఫ్యాకల్టీ, ట్యూటర్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫ్యాకల్టీ, ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ

UPSC Recruitment 2021: యూపీఎస్సీలో ఫ్యాకల్టీ, ట్యూటర్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..
Upsc
Follow us
uppula Raju

|

Updated on: Nov 27, 2021 | 5:39 PM

UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫ్యాకల్టీ, ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 డిసెంబర్ 2021. అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించి సమాచారాన్ని చదివిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టాలి. 21 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

అర్హతలు అసోసియేట్ ప్రొఫెసర్: కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ, లెక్చరర్ లేదా తత్సమాన గ్రేడ్ స్థాయిలో టీచింగ్, రీసెర్చ్ లేదా పరిశ్రమలో ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉండాలి. కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్/ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

ప్రొఫెసర్ : ఇంజనీరింగ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / కంట్రోల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పదేళ్ల బోధన అనుభవం ఉండాలి.

టీచర్ ట్యూటర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా B.Sc డిగ్రీ. నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ B.Sc. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందిన నర్సింగ్ కాలేజీలో ఒక సంవత్సరం అనుభవం, సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు, మిడ్-వైఫ్‌గా రిజిస్టర్ అయి ఉండాలి. విద్యార్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

దరఖాస్తు రుసుము దరఖాస్తు రుసుము రూ.25 మాత్రమే చెల్లించాలి. SBI నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించి లేదా వీసా/మాస్టర్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు.SC/ST/PWBD/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ దరఖాస్తుదారులు తమ వివరాలన్నింటినీ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్‌లో జాగ్రత్తగా నింపాలని సూచించారు. ఎందుకంటే తప్పు సమాచారాన్ని నింపడం వల్ల కమిషన్ అప్లికేషన్‌ అంగీకరించదు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ తెలియజేస్తారు.

1985లో ముద్రించిన ఈ రూపాయికి 2.5 లక్షలు.. కానీ దానిపై ఈ గుర్తు ఉండాలి..

అధికంగా దాహం వేస్తోందా.. పదే పదే నీరు తాగుతున్నారా.. అయితే ఈ వ్యాధి కావొచ్చు..!

LPG Subsidy: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. డిసెంబర్‌ నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ..! ఎవరికి లభిస్తుందంటే..?