AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికంగా దాహం వేస్తోందా.. పదే పదే నీరు తాగుతున్నారా.. అయితే ఈ వ్యాధి కావొచ్చు..!

Health News: సాధారణంగా మనం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఒక రోజులో 7 నుంచి 8 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే నీటి అవసరం

అధికంగా దాహం వేస్తోందా.. పదే పదే నీరు తాగుతున్నారా.. అయితే ఈ వ్యాధి కావొచ్చు..!
Water
uppula Raju
|

Updated on: Nov 27, 2021 | 3:54 PM

Share

Health News: సాధారణంగా మనం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఒక రోజులో 7 నుంచి 8 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే నీటి అవసరం ఎంతో ఉంది. నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. నీరు అనేక ఇతర వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. నీరు మన జీవితాన్ని సమతుల్యం చేస్తుంది కానీ దాని పరిమాణంలో తేడా వస్తే అది జీవితానికి సంక్షోభాన్ని సృష్టిస్తుంది. దాహం అనే భావన ద్వారా శరీరం నీటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటుంది. అయితే ప్రజలు అవసరానికి మించి నీటిని తీసుకోవడం చాలా సార్లు కనిపిస్తుంది. చాలా సార్లు దాహం లేకుండా వారు నీరు తాగుతూ ఉంటారు. అయితే అలా చేయడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం. ఈ నాలుగు సమస్యల గురించి తెలుసుకుందాం.

1. మధుమేహం ప్రస్తుతం మధుమేహ వ్యాధి అన్ని వయసుల వారిలోనూ వేగంగా విస్తరిస్తోంది. దీనికి కారణం చెడు జీవనశైలి. రక్తంలో చక్కెరశాతం పెరగడం వల్ల తరచుగా దాహం వేస్తుంది. శరీరంలో సరిపడ నీరు లేకపోతే మూత్రపిండాలు పనిచేయలేవు.

2. అజీర్ణం చాలా సార్లు స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు తేలికగా జీర్ణం కాదు. సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు కావాలి. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది అధిక దాహానికి కారణం అవుతుంది.

3. విపరీతంగా చెమటలు మీ శరీరం ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభిస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి ఎక్కువ నీటిని కోరుతుంది. దీని కారణంగా మనకు మరింత దాహం అనిపిస్తుంది.

4. ఆందోళన ఆందోళన కారణంగా నోరు ఎండిపోతుంది. దీనివల్ల ఒక వ్యక్తి ఎక్కువగా నీరు తాగుతారు. అటువంటి పరిస్థితిలో కొన్ని ఎంజైమ్‌లు నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మొత్తాన్ని కూడా తగ్గిస్తాయి. అప్పుడు అధికంగా దాహం వేస్తోంది.

గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. డిసెంబర్‌ నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ..! ఎవరికి లభిస్తుందంటే..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

పెను విధ్వంసం ఈ బ్యాట్స్‌మెన్‌.. 7 బంతుల్లో 6 సిక్సర్లు.. 22 బంతుల్లో 48 పరుగులు..