- Telugu News Photo Gallery Cricket photos South africa vs netherlands 1st odi andile phehlukwayo smashed 6 sixes
పెను విధ్వంసం ఈ బ్యాట్స్‌మెన్.. 7 బంతుల్లో 6 సిక్సర్లు.. 22 బంతుల్లో 48 పరుగులు..
South Africa vs Netherlands: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు చేశారు. అయితే ఆల్ రౌండర్ ఆండిలే ఫెహ్లుక్వాయో
Updated on: Nov 26, 2021 | 10:11 PM

దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు చేశారు. అయితే ఆల్ రౌండర్ ఆండిలే ఫెహ్లుక్వాయో పెను విధ్వంసం సృష్టించాడు.

ఫెహ్లుక్వాయో కేవలం 22 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 6 సిక్సర్లు, ఒక ఫోర్ వచ్చాయి. బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం కష్టంగా ఉన్న పిచ్‌పై ఫెహ్లుక్వాయో దుమ్ము రేపాడు.

ఫెహ్లుక్వాయో సిక్సర్లు, ఫోర్లతో 40 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి మొత్తం 7 బౌండరీలు వచ్చాయి అతని స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువ.

ఫెహ్లుక్వాయోతో పాటు వెరెన్ 112 బంతుల్లో 95 పరుగులు చేశాడు. జుబేర్ హమ్జా కూడా 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 277 పరుగులు చేసింది. కానీ నెదర్లాండ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే వర్షం రావడంతో మ్యాచ్ రద్దయింది.

దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ సిరీస్‌లు రద్దు కావొచ్చు. దక్షిణాఫ్రికాలో కరోనా న్యూ వేరియంట్ విజృంభిస్తోంది. దీని కారణంగా, నెదర్లాండ్స్ ఆటగాళ్ళు తమ దేశానికి తిరిగి రావచ్చు. భారత్-ఎ కూడా దక్షిణాఫ్రికాలో ఉంది. అయితే వీరు ఆడే సిరీస్ గురించి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.





























