- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: Hardik Pandya, Krunal Pandya maybe be join in Ahmedabad franchise and leave Mumbai Indians in ipl 2022
IPL 2022: వద్దంటోన్న ముంబై.. రమ్మంటోన్న కొత్త టీం.. సోదరులు చేరేది ఆ గూటికేనా? ఇషాన్, సూర్యకుమార్‌లలో నిలిచేది ఒక్కరే
IPL 2022 కోసం రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30 అని తెలిసిందే. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఆడటం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి.
Updated on: Nov 26, 2021 | 7:27 AM

Hardik Pandya

ఐపీఎల్ 2022 కోసం ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను రిటైన్ చేయడం లేదని వార్తలు బయటకు వచ్చాయి. అలాగే అతని అన్న కృనాల్‌ను కూడా రిటైన్ చేయరని తెలుస్తోంది. ఈ సోదరులిద్దరూ ముంబై టీంను బంతి, బ్యాటింగ్‌తో చాలా మ్యాచ్‌లు గెలిపించారు. కానీ ప్రస్తుతం ముంబైలో వీరి స్థానం కష్టమైందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కొత్త ఐపీఎల్ జట్టు అహ్మదాబాద్ నుంచి ఆడవచ్చనే వార్తలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈ సోదరులిద్దరూ అహ్మదాబాద్ ఫ్రాంచైజీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్ IPL 2022లో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌లను ఉంచుకోవచ్చు. అలాగే అట్టిపెట్టుకోవాల్సిన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ పేరు కూడా వినిపిస్తోంది. అంటే సూర్యకుమార్, ఇషాన్‌ల మధ్య గట్టి పోటీ ఉందని తెలుస్తోంది.

ధోనీ, జడేజా, రితురాజ్ గైక్వాడ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేస్తుందని భావిస్తున్నారు. నాలుగో ప్లేయర్‌లో సామ్ కరణ్, మొయిన్ అలీ మధ్య పోటీ నెలకొంది. రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షాలను ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓవర్సీస్ ప్లేయర్‌లో ఎన్రిక్ నోర్కియా, కగిసో రబడ మధ్య పోటీ నెలకొంది.





























