తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన టీం అబుదాబి జట్టు కేవలం 120 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. నాటౌట్‌గా నిలిచినా.. గేల్ మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. అబుదాబి కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ 6 బంతుల్లో 20 పరుగులు, ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 17 పరుగులు చేసినా జట్టు ఓటమిని తప్పించలేకపోయారు. బంగ్లా టైగర్స్ తరఫున విల్ జాక్వెస్ 17 బంతుల్లో 43 పరుగులు, హజ్రతుల్లా జజాయ్ 20 బంతుల్లో 41 పరుగులు చేశారు.