IIT Recruitment: ఖరగ్‌పూర్ ఐఐటీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IIT Kharagpur Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ ప్రఖ్యాత విద్యా సంస్థలో...

IIT Recruitment: ఖరగ్‌పూర్ ఐఐటీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Iit Recruitment
Follow us

|

Updated on: Nov 27, 2021 | 5:26 PM

IIT Kharagpur Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ ప్రఖ్యాత విద్యా సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, బీటెక్‌/ఎంటెక్‌/ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్‌/గేట్‌ అర్హత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 34,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 14-12-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: 15 నిమిషాల్లో ప్రాణం తీసేస్తుంది !! ఇదేంటో తెలుసా ?? వీడియో

Trivikram Srinivas: త్రివిక్రమ్‏కు తప్పని సోషల్ మీడియా తిప్పలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

AP Asha Worker Jobs: ఏపీలోని కడప జిల్లాలో ఆశా వర్కర్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..