Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?

Car prices: భారత్‌లో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కరోనా కారణంగా మార్కెట్ మందగించడం వల్ల కార్ల తయారీదారులు ధరలను పెంచే ఆలోచనలో ఉన్నారు.

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?
Mahindra Cars
Follow us
uppula Raju

|

Updated on: Nov 27, 2021 | 10:06 PM

Car prices: భారత్‌లో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కరోనా కారణంగా మార్కెట్ మందగించడం వల్ల కార్ల తయారీదారులు ధరలను పెంచే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే చాలాసార్లు ధరలు పెంచినా తయారీ ఖర్చు తగ్గడం లేదని కంపెనీలు భావిస్తున్నాయి. కాబట్టి వారు ధరలు పెంచడం తప్ప మరో మార్గంలేదని వాదిస్తున్నారు. ఈ కార్ల ధరలు పెరిగితే ఇది నాలుగోసారి అవుతుంది. MG మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ.. “కనెక్టెడ్ వెహికల్ వర్చువల్ సమ్మిట్ 2021లో కార్ల ధరలలో పెరుగుదలను అంచనా వేయవచ్చు. మేము వినియోగదారులపై పూర్తి భారాన్ని వేయలేదు. ధరలు పెంచడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఈ ధరలు జనవరి మొదటి వారంలో పెరగవచ్చు.

ప్రస్తుతం కార్ల సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా పరిశ్రమ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇది వ్యాపారంలో నగదు ప్రవాహం, ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన విజయ్ నక్రా కూడా కార్ల ధరలు పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. కొత్త CAFE నియమావళికి అనుగుణంగా కంపెనీలు పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ ఎండీ, సీఈవో వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ.. కార్ల ధరలను పెంచాల్సిన అవసరం ఉందని అయితే ఎంత వరకు పెంచాలనేది మన చేతుల్లో లేదన్నారు. మారుతీ సుజుకీ 2021లో తన కార్ల ధరలను మూడు సార్లు పెంచింది. జనవరి, జూన్, సెప్టెంబర్‌లలో ధరలను పెంచింది.

భారత్‌, బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే నది గురించి మీకు తెలుసా.. ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే..?

UPSC Recruitment 2021: యూపీఎస్సీలో ఫ్యాకల్టీ, ట్యూటర్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

LPG Subsidy: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. డిసెంబర్‌ నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ..! ఎవరికి లభిస్తుందంటే..?

తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్..తెరిచి చూడగా
తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్..తెరిచి చూడగా
వచ్చే నెలలో పెళ్లి పీటలెక్కనున్న మహానటి..
వచ్చే నెలలో పెళ్లి పీటలెక్కనున్న మహానటి..
మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..
మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..
లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు
లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు
ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..
ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..
వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు
వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..
ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది
ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది
గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..
గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..
చదివింది బీటెక్‌ చేసేది మోసం.. ఏకంగా రూ. 60 లక్షలు కొట్టేశాడు.
చదివింది బీటెక్‌ చేసేది మోసం.. ఏకంగా రూ. 60 లక్షలు కొట్టేశాడు.