AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌, బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే నది గురించి మీకు తెలుసా.. ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే..?

dawky River: ఉత్తర భారతదేశం అంటేనే పర్యాటకానిక పెట్టింది పేరు. ప్రకృతి అందాలకు నిలయం. ప్రతి క్షణం ఉల్లాసభరితంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి

భారత్‌, బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే నది గురించి మీకు తెలుసా.. ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే..?
Dawki Meghalaya
uppula Raju
|

Updated on: Nov 27, 2021 | 6:39 PM

Share

dawky River: ఉత్తర భారతదేశం అంటేనే పర్యాటకానిక పెట్టింది పేరు. ప్రకృతి అందాలకు నిలయం. ప్రతి క్షణం ఉల్లాసభరితంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఉత్తర భారతదేశాన్ని సందర్శించడానికి వస్తారు. ముఖ్యంగా మేఘాలయలో ఉండే డాకీ నది గురించి తెలుసుకోవాలి. డోకి లేదా డాకీ మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో ఉన్న ఒక చిన్న సరిహద్దు పట్టణం. ఈ నగరం డోకి నదికి అందమైన సస్పెన్షన్ వంతెనకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు, ఫోటోగ్రాఫర్‌లు ఈ నగరానికి వస్తారు. ఈ ప్రదేశం అందాలను తమ కెమెరాలలో బంధిస్తారు.

మేఘాలయ సందర్శనా స్థలం డాకీ నది మేఘాలయలోని పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ నది అందమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. నీరు ఎంతో శుభ్రంగా, చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు గులకరాళ్లు, చేపలను కూడా స్పష్టంగా చూడవచ్చు. డోకీ ప్రాథమికంగా సరిహద్దు పట్టణం, భారతదేశాన్ని బంగ్లాదేశ్ నుంచి వేరు చేస్తుంది. ఈ నగరం ఖచ్చితంగా చిన్నది. కానీ చాలా అందంగా ఉంటుంది. ఇది నది సస్పెన్షన్ వంతెనకు ప్రసిద్ధి చెందింది.

ఈ వంతెన నదిపై నిర్మించిన వేలాడే వంతెన. ఈ వంతెనను 1932లో బ్రిటిష్ వారు నిర్మించారు. కొద్ది రోజుల క్రితం జలశక్తి మంత్రిత్వ శాఖ డాకీ నదికి భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నది అనే బిరుదును ఇచ్చింది. మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో నదికి సంబంధించిన అనేక ఉత్కంఠభరితమైన చిత్రాలను షేర్ చేసింది. ఈ నది నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. ఇందులోని పడవలు అద్దంపై తేలుతున్నట్లుగా కనిపిస్తాయి. ఈ నది భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ప్రవహిస్తుంది. ఇది ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. ఇక్కడ పడవ ప్రయాణం తప్పనిసరి.

UPSC Recruitment 2021: యూపీఎస్సీలో ఫ్యాకల్టీ, ట్యూటర్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

1985లో ముద్రించిన ఈ రూపాయికి 2.5 లక్షలు.. కానీ దానిపై ఈ గుర్తు ఉండాలి..

LPG Subsidy: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. డిసెంబర్‌ నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ..! ఎవరికి లభిస్తుందంటే..?