AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South India: దక్షిణ భారతదేశంలో న్యూ ఇయర్‌ వేడుకలకు ఈ ప్రదేశాలు చాలా ఫేమస్‌..

South India: దక్షిణ భారతదేశంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రసిద్ధ బీచ్‌లు, హిల్ స్టేషన్‌ల అసమానమైన

South India: దక్షిణ భారతదేశంలో న్యూ ఇయర్‌ వేడుకలకు ఈ ప్రదేశాలు చాలా ఫేమస్‌..
South India
uppula Raju
|

Updated on: Nov 26, 2021 | 7:14 PM

Share

South India: దక్షిణ భారతదేశంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రసిద్ధ బీచ్‌లు, హిల్ స్టేషన్‌ల అసమానమైన అందాలను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతారు. అంతేకాదు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. కూర్గ్ పశ్చిమ కనుమల సానువుల్లో ఉన్న కూర్గ్ అందమైన ప్రదేశం. ఈ ప్రాంతం పక్షులను చూడటం, ప్రకృతిలో విహరించడం, ట్రెక్కింగ్‌ వంటి వాటికి ప్రసిద్ధి చెందింది. వన్యప్రాణుల రిసార్ట్‌లు, జలపాతాలు, నదులు, బౌద్ధ ఆరామాలు అదనపు ఆకర్షణ. సెలవుల్లో మీకు మంచి అనుభూతిని మిగులుస్తుంది.

2. మున్నార్ ఇది బహుశా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కోరుకునే గమ్యస్థానం. టీ ప్రేమికులకు ఆసక్తిగల ప్రయాణికులకు స్వర్గధామం. మంత్రముగ్ధులను చేసే అందమైన సరస్సులు, తేయాకు తోటలు కనువిందు చేస్తాయి. ఇక్కడ కనిపించే అన్యదేశ వృక్షజాలం, జంతుజాలం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

3. ఏర్కాడ్ ఏర్కాడ్ తమిళనాడులోని ఒక సుందరమైన హిల్ స్టేషన్. అందమైన ప్రదేశాలతో నిండి ఉంది. మీరు ప్రకృతి ఒడిలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలనుకుంటే ఈ ప్రదేశం మంచి ఎంపిక. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, నారింజ తోటలు ఎక్కువగా ఉంటాయి.

4. కొడైకెనాల్ తమిళనాడు ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఇది ఒకటి. ఈ హిల్ స్టేషన్‌లోని మంత్రముగ్ధులను చేసే అందాలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతాయి. ఈ ప్రదేశంలోని అద్భుతమైన జలపాతాలు, అడవులు, లోయలు ప్రధాన ఆకర్షణలు.

5. అరకు లోయ మీరు సెలవులను ఎంజాయ్ చేయాలంటే అరకు లోయకి మించినది మరొకటి ఉండదు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. పర్యాటకులకు మంచి అనుభూతులను మిగుల్చుతుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో చాలా మంది ప్రజలు చలికాలంలో అరకును సందర్శించడానికి ఇష్టపడతారు. ఇక్కడ సాహసోపేతమైన కార్యకలాపాలలో కూడా మునిగిపోవచ్చు.

దగ్గు, గొంతునొప్పి భరించలేకపోతున్నారా..! అయితే వీటి గురించి తెలుసుకోండి..

షుగర్‌ వ్యాధి కారణంగా స్వీట్లకు దూరంగా ఉంటున్నారా..! ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

బరువు తగ్గడానికి రన్నింగ్‌, జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్నారా..! ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి..