Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్‌ వ్యాధి కారణంగా స్వీట్లకు దూరంగా ఉంటున్నారా..! ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

Health News: చక్కెర వినియోగం ఆరోగ్యానికి హానికరం ఇది అందరికీ తెలుసు. డయాబెటిక్ రోగులకు చక్కెర విషంలాంటిది. అందువల్ల వీరు స్వీట్ లేదా షుగర్ తీసుకోవడం తగ్గించమని

షుగర్‌ వ్యాధి కారణంగా స్వీట్లకు దూరంగా ఉంటున్నారా..! ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
Suger
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2021 | 5:58 PM

Health News: చక్కెర వినియోగం ఆరోగ్యానికి హానికరం ఇది అందరికీ తెలుసు. డయాబెటిక్ రోగులకు చక్కెర విషంలాంటిది. అందువల్ల వీరు స్వీట్ లేదా షుగర్ తీసుకోవడం తగ్గించమని సలహా ఇస్తారు. వాస్తవానికి అధిక చక్కెర రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని పెంచుతాయి. ఇది డయాబెటిక్ రోగికి చాలా ప్రమాదకరం. ఎక్కువ చక్కెర వాడకం సాధారణంగా ఎవ్వరికీ మంచిది కాదు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయి. మీరు స్వీట్లను తినడానికి ఇష్టపడితే చక్కెరకు బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన ఎంపికలను ట్రై చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. పరిమిత పరిమాణంలో.. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే వీలైనంత వరకు స్వీట్లకు దూరంగా ఉండాలి. మధుమేహం కారణంగా శరీరం ఏ రకమైన చక్కెరను త్వరగా జీర్ణం చేసుకోదు. అటువంటి పరిస్థితిలో స్వీట్ తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. ఊబకాయంతో బాధపడేవారు కూడా చక్కెర ప్రత్యామ్నాయాన్ని ప్రయత్నించాలి.

2. చక్కెరను బెల్లంతో భర్తీ చేయండి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెర కంటే బెల్లం ఆరోగ్యకరమైనది. అటువంటి పరిస్థితిలో శీతాకాలంలో బెల్లం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. స్వీట్లలో చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవచ్చు. ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం మొదలైనవి బెల్లంలో లభిస్తాయి. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు చక్కెరకు బదులు బెల్లం తినాలి.

3. ఖండ్ చక్కెర ఉత్తమ ఎంపిక పంచదారకు బదులుగా ఖండ్ చక్కెర మంచి ఎంపిక. చెరకు రసం నుంచి దీనిని తయారుచేస్తారు. ఇది తెల్లగా ఉంటుంది. ఇందులో ఐరన్, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

4. తేనె కంటే మెరుగైనది ఏది ఉండదు.. చాలామంది తేనె ఏళ్ల తరబడి వాడుతున్నారు. చక్కెరకు బదులుగా మీ జీవితంలో తేనెను ఉపయోగించండి. తియ్యగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ చాలా సహజంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు.

Hyderabad‌: ఓటర్లకు గమనిక.. ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ క్యాంపెయిన్

Post Office: పోస్టాఫీసులో నెలకి 10,000 పెట్టండి..16 లక్షలు పొందండి..

భారత రాజ్యాంగం గురించి వాస్తవాలు.. 15 ప్రత్యేక విషయాలు తెలుసుకోండి..