Tomato Price Hike: టమాటా లేకుండా దక్షిణాది ఫేమస్ వంటకం.. రుచికరమైన సాంబారు తయారీ విధానం

Tomato Price Hike: రోజు రోజుకీ టమాటా ధరలు భారీ పెరుగుతూ మధ్య, సామాన్య ప్రజలకు అందకుండా ఉన్నాయి. అయితే భారతీయ వంటల్లో టమాటా అత్యధిక ప్రాధాన్యతను సొంతం..

Tomato Price Hike: టమాటా లేకుండా దక్షిణాది ఫేమస్ వంటకం.. రుచికరమైన సాంబారు తయారీ విధానం
Sambar Recipe
Follow us

|

Updated on: Nov 26, 2021 | 3:36 PM

Tomato Price Hike: రోజు రోజుకీ టమాటా ధరలు భారీ పెరుగుతూ మధ్య, సామాన్య ప్రజలకు అందకుండా ఉన్నాయి. అయితే భారతీయ వంటల్లో టమాటా అత్యధిక ప్రాధాన్యతను సొంతం చేసుకుంది. ఎక్కువగా టమాటాని ఉపయోగించే కూరలు తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న టమాటా ధరలు వినియోదారులకు ఓ రేంజ్ లో షాక్ ఇస్తున్నాయి. దీంతో టమాటా లేకుండా కూరలు తయారీ పై దృష్టి పెట్టారు. ఈరోజు టమాటాలు అవసరం లేని ఒక దక్షిణాది వంట.. మరొకటి నార్త్ ఇండియన్ వంటల రెసిపీ గురించి తెలుసుకుందాం..దక్షిణాదిలో మోస్ట్ ఫేమస్ వంటకం. సాంబారు. ఈరోజు టమాటా లేకుండా సాంబారు తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

కంది పప్పు- ఒక కప్పు ఉప్పు -రుచికి సరిపడా బెల్లం -చిన్న ముక్క సాంబార్ మసాలా- మూడు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు – రుచికి సరిపడా ఆవాలు- ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు-3 రెమ్మలు కారం -రెండు స్పాన్లు ఎండు మిర్చి వెల్లుల్లి ఇంగువ పచ్చి మిర్చి 5 క్యారెట్, ఆనపకాయ, ములక్కాడ, ముల్లంగి కూరగాయల ముక్కలు ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసినవి నూనె సరిపడా కొత్తిమీర ఆకులు తగినవి కొన్ని

సాంబార్ తయారీ విధానం: ముందుగా కుక్కర్ తీసుకుని కొంచెం నీరు వేసి.. అందులో ఒక గిన్నె పెట్టి.. అందులో కంది పప్పు వేసుకోవాలి.. దాని మీద మరొక గిన్నె పెట్టి.. కూరగాయల ముక్కలు వేసుకుని మూత పెట్టి.. మూడు విజిల్స్ వచ్చాక స్టౌ కట్టేసి.. చల్లారిన తర్వాత ఒక దళసరి గిన్నెలో ఉడికిన పప్పుని, ఉడికించిన కూరగాయల ముక్కలను, సాంబార్ మసాలా పొడిని, చింత పండు గుజ్జు, సరిపడా ఉప్పు, కొంచెం కారం, బెల్లం ముక్క వేసుకుని ఉడికించాలి. సాంబార్ మరిగిన తర్వాత వేరే గిన్నె తీసుకుని స్టౌ మీద పెట్టి.. కొంచెం నూనె వేసుకుని అందులో ఆవాలు, ఎండు మిర్చి, కర్వేపాకు, ఇంగువ, వెల్లుల్లి వేసుకుని వేయించి.. ఈ తిరగమోతని సాంబార్ లో వేయండి. మళ్ళీ కొంచెం సేపు మరిగించిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకుని స్టౌ మీద నుంచి దింపేస్తే సరి. ఈ సాంబార్ ను అన్నంలోకి ఇడ్లి, దోస వంటి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది.

Also Read:  తప్పిపోయిన రామ చిలుక కోసం యజమాని వెదుకులాట.. తెచ్చి ఇస్తే.. రూ. 15 వేలు రివార్డ్ ఎక్కడంటే..