Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Missing Parrot: తప్పిపోయిన రామ చిలుక కోసం యజమాని వెదుకులాట.. తెచ్చి ఇస్తే.. రూ. 15 వేలు రివార్డ్ ఎక్కడంటే..

Missing Parrot: పెంపుడు జంతువులు, పక్షులను కొంతమంది తమ కుటుంబంలో ఓ సభ్యులా భావించి వాటిని తమ పిల్లలతో సమానంగా భావించి ప్రేమగా చూసుకుంటారు.  తమ పెంపుడు..

Missing Parrot: తప్పిపోయిన రామ చిలుక కోసం యజమాని వెదుకులాట.. తెచ్చి ఇస్తే.. రూ. 15 వేలు రివార్డ్ ఎక్కడంటే..
Missing Parrot
Follow us
Surya Kala

|

Updated on: Nov 26, 2021 | 3:03 PM

Missing Parrot: పెంపుడు జంతువులు, పక్షులను కొంతమంది తమ కుటుంబంలో ఓ సభ్యులా భావించి వాటిని తమ పిల్లలతో సమానంగా భావించి ప్రేమగా చూసుకుంటారు.  తమ పెంపుడు జంవుతువులకు, పక్షులకు పుట్టినరోజు వేడుకలు వంటివి చేసి.. తమ సంతోషన్ని అందరితోనూ పంచుకుంటున్నారు. కూడా అయితే తాజాగా ఓ వ్యక్తి , ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక తప్పి పోయింది. దీంతో ఆ పక్షి యజమాని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన పెంపుడు పక్షి కోసం వెదకడం మొదలు పెట్టాడు. అంతేకాదు.. ఏకంగా పక్షికోసం పాంప్లెట్స్ పంచిపెడుతూ.. తన రామచిలుకని తెచ్చి ఇచ్చినవారికి ఏకంగా భారీ నజరానా కూడా ప్రకటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని రాంఝీ మనేగావ్‌కు చెందిన అమన్‌సింగ్ చౌహాన్ అనే వ్యక్తి తప్పిపోయిన తన రామ చిలుకను తిరిగి తీసుకొచ్చే వారికి రూ.15,000 బహుమతిని అందజేస్తానని ప్రకటించాడు. అంతేకాదు తన చిలుక పేరు బిట్టు అని దాని వివరాలతో కూడిన కరపత్రాలను ముద్రించి.. చిలుకను వెదకడానికి ప్రజల సహాయం కోరుతున్నాడు. ఇప్పటికే ఆ పాంప్లెట్స్ ను నగరంలో పంపిణీ చేశాడు. అమన్ దగ్గర ఆ రామ చిలుక దాదాపు రెండేళ్లు ఉంది. దానికి బిట్టు అనేపేరు పెట్టుకుని చిన్న పిల్లతో సమానంగా పెంచుకుంటున్నాడు. అయితే నవంబర్ 2వ తేదీన, చిలుక పంజరం తలుపు తెరుచుకుని బయటకు వచ్చి బాల్కనీలో ఎగరడం ప్రారంభించింది.

అయితే కొంత సమయం తరువాత, అది అకస్మాత్తుగా అదృశ్యమైంది. అమన్ తన చిలుక కోసం ఇంట్లో..  చుట్టుపక్కల వెతికాడు..  కానీ రామచిలుక కనిపించకపోవడంతో వెంటనే చిలుక తన చిలుక బిట్టు అదృశ్యమైనట్లు ఓ వార్తా పత్రికలో  ప్రకటన ఇచ్చాడు. అయినప్పటికీ చిలుక గురించి ఏ వివరాలు తెలియకపోవడంతో.. తన బిట్టుని తిరిగి తనకు తెచ్చి ఇచ్చిన వారికి రూ.15 వేలు రివార్డు ఇస్తానని ప్రకటించాడు. అందుకు సంబంధించిన కరపత్రాలను ముద్రించి నగరం అంతా పంచిపెట్టాడు.

బిట్టు కనిపించకుండా పోయినప్పటి నుండి అమన్ చాలా ఆందోళన చెందాడు. బిట్టు కోసం వెతుకుతున్నాడు. ఈ పాంప్లెట్స్ చూసిన కొందరు అమన్‌ను సంప్రదించారు. అయితే వారు చూపించిన చిలుక తనది కాదని.. ఎలాగైనా తన బిట్టు తనదగ్గరకి తిరిగి చేరుతుందని అమన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Also Read:  ప్రపంచంలోనే ఖరీదైన మేకపోతు.. దీని ధర తెలిస్తే షాక్.. ఎక్కడంటే..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌