Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits Recipe: శీతాకాలంలో ఇది తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.. ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసా..

ఉత్తర భారతీయ స్పెషల్ వంటకం. తెలుగు రాష్ట్రాల్లో కూడా పల్లి పట్టీ.. డ్రైఫ్రూట్ చెక్కి అంటారు. దీనిని శీతాకాలంలో ఎక్కువగా తింటారు.

Dry Fruits Recipe: శీతాకాలంలో ఇది తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.. ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసా..
Dry Fruits
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 26, 2021 | 1:43 PM

Palli Patti – Dry Fruits Recipe: గజక్ అనేది ఉత్తర భారతీయ స్పెషల్ వంటకం. తెలుగు రాష్ట్రాల్లో కూడా పల్లి పట్టీ.. డ్రైఫ్రూట్ చెక్కి అంటారు. దీనిని శీతాకాలంలో ఎక్కువగా తింటారు. ఇది చాలా ఆరోగ్యకరమైనది. చలికాలంలో ఎక్కువగా తినే ఆహారాలు డ్రై ఫ్రూట్స్, బెల్లం, వేరుశెనగ మొదలైనవి. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఇది పనిచేస్తుంది. మీరు ఈ వస్తువులతో గజక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇది భోజనం తర్వాత మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇంట్లోనే గజక్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్ గజక్ రెసిపీ

నువ్వులు (తెలుపు) – 1 కప్పు

నెయ్యి – 1-2 tsp

బెల్లం – 200 గ్రాములు

డ్రై ఫ్రూట్స్ (బాదం, పిస్తా, జీడిపప్పు) – 100 గ్రాములు సన్నగా తరిగినవి

వేరుశెనగ – 50 గ్రాములు

ఎలా తయారు చేయాలి

దశ 1

గ్యాస్ బర్నర్ మీద పాన్ వేసి అందులో నువ్వులు వేయాలి. వాటిని లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అవి వేయించిన తర్వాత వాటిని ప్లేట్‌లో వేసి చల్లబరచాలి.

దశ – 2

ఇప్పుడు అదే బాణలిలో జీడిపప్పు, పిస్తా, బాదం, వేరుశెనగ వంటి డ్రై ఫ్రూట్స్‌ వేయాలి. వాటిని తక్కువ మంట మీద వేయించాలి అయితే అవి నల్లగా మారకుండా చూసుకోవాలి.

దశ – 3

కాల్చిన డ్రై ఫ్రూట్స్‌ను మంట నుండి తీసివేసిన తర్వాత పాన్‌లో నెయ్యి వేయండి. దానికి బెల్లం వేసి తక్కువ మంట మీద కరిగించాలి. కరిగిన బెల్లం పాన్‌కు అంటుకోకుండా నిరంతరం కలపాలి.

దశ – 4

బెల్లం కరిగిన తర్వాత మీరు వేయించిన నువ్వులను జోడించవచ్చు. ముద్దలు రాకుండా బాగా కలపాలి.

దశ-5

తర్వాత అందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. మంట తక్కువగా ఉంచండి. ఇది 1-2 నిమిషాలు ఉడికించాలి.

దశ-6

ఫ్లాట్ ప్లేట్‌లో కొన్ని చుక్కల నెయ్యితో గ్రీజ్ చేసి, ఆపై మిశ్రమాన్ని పోయాలి. దానిని సమానంగా పోయండి.

దశ-7

చల్లారాక కావలసిన ఆకారాలు, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెక్కీ తినడానికి సిద్ధంగా ఉంది.

పదార్థాల ఆరోగ్య ప్రయోజనాలు 

1. డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా చలికాలంలో మృదువుగా.. మెరిసే చర్మాన్ని పొందడంలో సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అవి శక్తి స్థాయిని పెంచుతాయి. 2. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన స్వీటెనర్, అద్భుతమైన క్లెన్సర్, గ్లూకోజ్ నియంత్రణ, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 4. నువ్వులలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది చలికాలంలో కీళ్ల నొప్పులు, వెన్నునొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి: Success Mantras: విజయానికి నాలుగు మెట్లు.. వీటిని అర్థం చేసుకున్న వారికి ఏదీ అసాధ్యం కాదు..

Constitution Day 2021: నవంబర్ 26 ప్రత్యేక ఏంటో తెలుసా.. ప్రతి ఒక్కరు ఈ రోజు స్పెషల్ ఎంటో తెలుసుకోవాలి..