Betel Leaves Benefits: ఆరోగ్య సంజీవని తమలపాకు.. రోజుకు రెండు తింటే చాలు..!

Betel Leaves Benefits: ఇంట్లో ఏ పూజ జరిగినా పూలు, పండ్లతో పాటు ముఖ్యంగా కనిపించేవి తమలపాకులే.. ఇవి కేవలం పూజలకు మాత్రమే కాదు.. అనేకానేక ఆరోగ్య సమస్యలకు సైతం సంజీవనిగా

Betel Leaves Benefits: ఆరోగ్య సంజీవని తమలపాకు.. రోజుకు రెండు తింటే చాలు..!
Betel Leaves
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 26, 2021 | 7:02 AM

Betel Leaves Benefits: ఇంట్లో ఏ పూజ జరిగినా పూలు, పండ్లతో పాటు ముఖ్యంగా కనిపించేవి తమలపాకులే.. ఇవి కేవలం పూజలకు మాత్రమే కాదు.. అనేకానేక ఆరోగ్య సమస్యలకు సైతం సంజీవనిగా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు తమలపాకులు నమలితే చాలు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట.

నోటి పూత, నోటి దుర్వాసన తమలపాకు నమలడం ద్వారా తగ్గుతుంది. చిగుళ్లకు మేలుచేస్తుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.. దగ్గు, ఆయాసంతో బాధపడతున్న పిల్లలకు… తమలపాకులను ఆవనూనెలో నానపెట్టి కొద్దిగా వేడిచేసి చాతీపై రుద్దాలి. ఇలా చేస్తే వారికి ఉపశమనం కలుగుతుంది. తమలపాకు రసాన్ని గొంతు భాగంలో రుద్దితే గొంతు మంట, ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గుతుంది. గాయాలు వేధిస్తున్నట్లయితే తమలపాకులను నూరి, ఆ రసాన్ని వాటిపై రాస్తే త్వరగా మానిపోతాయి. వెన్ను నొప్పితో బాధపడుతున్న వాళ్లు… కొబ్బరినూనెలో తమలపాకుల రసాన్ని కలిపి వీపు వెనుక భాగంలో రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక చెవి పోటుతో కలిగే బాధ వర్ణనాతీతం. కొన్ని చుక్కల తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది.

ఆర్థరైటిస్‌ వల్ల కీళ్ల భాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవాళ్లు తమలపాకుల్లో సున్నం కలిపి తింటే మేలు. విటమిన్‌ సీ అధికంగా కలిగి ఉండే తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు. కాన్సర్‌ నిరోధక కారకంగానూ తమలపాకు పనిచేస్తుంది.

Also read:

Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..

Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..