Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..

తమిళ నటుడు 'చియాన్‌' విక్రమ్‌ సినిమా పాత్రల కోసం ఎంత పరితపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల కోసం

Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2021 | 10:19 PM

తమిళ నటుడు ‘చియాన్‌’ విక్రమ్‌ సినిమా పాత్రల కోసం ఎంత పరితపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల కోసం తన శరీరాన్ని కష్టపెడుతుంటారాయన. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ తదితర సినిమాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆయన ‘కోబ్రా’ అనే మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్‌’ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన విక్రమ్‌ లుక్స్‌, టీజర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా వివిధ గెటప్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు విక్రమ్‌. కాగా కరోనా వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ తాజాగా తిరిగి ప్రారంభమైంది.

సుమారు ఆరు నెలల విరామం తర్వాత ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ చెన్నైలోని గ్రీన్‌మ్యాట్‌ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తామని.. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని డైరెక్టర్‌ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Also Read:

Aishwarya Rajesh: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న చేపకళ్ల సుందరి.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్..

Kareena Kapoor: తైమూర్‌కు ఆ మాట చెబితే నాపైనే అరుస్తాడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కరీనా..

Chatrapathi’s Sureedu: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!