Bigg Boss 5: ”హగ్గులు నచ్చట్లేదు”.. సిరికి తల్లి చివాట్లు.. ఏడ్చేసిన షణ్ముఖ్‌!

తెలుగు బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. గొడవలు, కొట్లాటలు, కోపాలు, తాపాలు.. ఇలా ఎన్నో ఎమోషన్స్ నడుమ...

Bigg Boss 5: ''హగ్గులు నచ్చట్లేదు''.. సిరికి తల్లి చివాట్లు.. ఏడ్చేసిన షణ్ముఖ్‌!
Shanmukh Siri

తెలుగు బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. గొడవలు, కొట్లాటలు, కోపాలు, తాపాలు.. ఇలా ఎన్నో ఎమోషన్స్ నడుమ కంటెస్టంట్స్ ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ టైం కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల రాకతో బిగ్ బాస్ హౌస్‌లో సందడి వాతావరణం నెలకొంది. నవంబర్ 24వ తేదీ ఎపిసోడ్‌లో కాజల్ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రాగా.. నిన్న శ్రీరామ్, మానస్, సిరి ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీరామ్, మానస్‌లు తమ కుటుంబసభ్యులను చూసి తెగ సంతోషపడగా.. సిరికి మాత్రం ఆమె తల్లి నుంచి చివాట్లు పడ్డాయి. ఆ వివరాలు..

హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సిరి తల్లి శ్రీదేవి.. వచ్చీ రాగానే కూతురుకు చివాట్లు పెట్టింది. ‘షణ్ముఖ్‌ను హాగ్ చేసుకోవడం నచ్చలేదని’ ముక్కుసూటిగా చెప్పింది. దగ్గరవ్వడం మంచిదే గానీ హద్దులు దాటి హగ్గులు చేసుకోవడం నచ్చడం లేదంటూ శ్రీదేవి చెప్పగా.. టాపిక్ డైవర్ట్ చేస్తూ తల్లిని సిరి పక్కకి తీసుకెళ్తుంది. ‘హాగ్ చేసుకోవడం నచ్చలేదంటే నన్ను పక్కకి పిలిచి పర్సనల్‌గా చెప్పొచ్చుగా.. ఇలా చెబితే వాళ్లు ఏమనుకుంటారు’ అని సిరి తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘తల్లిగా ఈ విషయాలు చెప్పడం నా బాధ్యత. అందుకే చెప్పాను’ అని శ్రీదేవి చెబుతుంది. ఆ తర్వాత తన కష్టాలు చెప్పుకుని బాధపడిన ఆమె.. కూతురును ఎలాగైనా కప్పు పట్టుకుని ఇంటికి రమ్మంటుంది. అనంతరం శ్రీదేవి హౌస్ మేట్స్ అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్తుంది. ఆమె వెళ్లిపోయాక సిరి వచ్చి షణ్ముఖ్‌ను హాగ్ చేసుకుని ఏడవగా.. షణ్నూ మాత్రం ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా ఆటను కూడా పక్కనబెట్టి సిరికి ఇంత సపోర్ట్ ఇస్తుంటే.. ఆమె తల్లితో మాటలు పడాల్సి వచ్చిందని బాధపడ్డాడు. హగ్గులు నచ్చడం లేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. హౌస్‌లో ఉండేందుకు తాను అర్హుడిని కాదని అనుకుంటూ కుమిలిపోయాడు.

శ్రీరామ్ కోసం అతడి సోదరి అశ్విని హౌస్‌లోకి వచ్చింది. గేమ్‌కు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చిన ఆమె.. బామ్మ కప్పు గెలిచి మరీ రమ్మని చెప్పిందని.. దాని కోసం కష్టపడమని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మానస్ తల్లి పద్మిని హౌస్‌లోకి అడుగుపెట్టింది. హౌస్ మేట్స్ అందరినీ పలకరించి.. మానస్‌తో పర్సనల్‌గా సంభాషించింది. ”నీ దృష్టి మొత్తం టాప్ 5లోకి రావడంపైనే ఉండాలి. నిన్ను విన్నర్‌గా చూడాలనుకుంటున్నా. పక్కవాళ్ళు ఎంత డిస్టర్బ్ చేస్తున్నా పట్టించుకోకుండా నీ ఆట నువ్వు ఆడు. తప్పకుండా ఫినాలే చేరుకుంటావని నాకు నమ్మకం ఉందని చెబుతూ” కొడుక్కి ధైర్యం నూరిపోసింది. అనంతరం పద్మిని వీడ్కోలు చెప్పింది.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?

Click on your DTH Provider to Add TV9 Telugu