AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో మరో లొల్లి.. గత కొన్ని రోజులుగా మా ఆఫీస్‌కు తాళం?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరో వివాదం రేగింది. ఈనాటి వరకు ఎన్నికలంటూ సభ్యులు చేసిన హడావిడి చూసాం ఇప్పుడు.. మరో వివాదం తెర పైకి వచ్చింది.

MAA : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో మరో లొల్లి.. గత కొన్ని రోజులుగా మా ఆఫీస్‌కు తాళం?
Maa
Rajeev Rayala
|

Updated on: Nov 26, 2021 | 4:02 PM

Share

MAA : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో మరో వివాదం రేగింది. ఈనాటి వరకు ఎన్నికలంటూ సభ్యులు చేసిన హడావిడి చూసాం ఇప్పుడు మరో వివాదం తెర పైకి వచ్చింది. మా అసోసియేషన్‌లో గెలిచిన మంచు విష్ణు..అలాగే ఆయన  ప్యానెల్ ‘మా’ సభ్యులకు అందుబాటులో ఉండటం లేదంటూ ఆరోపిస్తున్నారు సభ్యులు. మా అసోసియేషన్ కి ఎప్పుడు వెళ్లిన ఆఫీస్‌కి లాక్ చేసే ఉంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే మా సభ్యులకు అందుబాటు లోనే వున్నాము అంటున్నారు మంచు విష్ణు టీమ్. మా ఆఫీస్ సిబ్బంది.. వాళ్ల పర్సనల్ రీజన్స్ వల్ల రావడం లేదని అంటున్నారు.

ఇక ఈ నెల 28న జరిగే మీటింగ్ లో సిబ్బంది నీ మార్చే అంశం పై నిర్ణయం తీసుకోనున్నారు మంచు విష్ణు.మా సభ్యులకు ఇచ్చిన హామీలను అమలు పరచడం లో పర్ ఫెక్ట ప్లాన్ తో నే ముందుకు వెళ్తున్నాం అంటున్నారు మంచు విష్ణు టీమ్. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులు అయ్యింది. మా అధ్యక్షుడి గా మంచు విష్ణు తొలి నిర్ణయం.. మా లో మహిళ సాధికారత పిర్యాదులు విభాగం ఏర్పాటు చేశారు . రీసెంట్ గా.మా’ సభ్యుల కోసం ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో ఉచితంగా హెల్త్ చెకప్.. 50 శాతం రాయితీతో ఓపీ కన్సల్టేషన్ ..వచ్చే ఏడాది పలు ఆసుపత్రుల్లో హెల్త్ క్యాంపులు ..అపోలో, సన్ షైన్, ఏఐజీ, కిమ్స్, మెడికవర్ ఆసుపత్రుల్లో ‘మా’ సభ్యులకు వైద్య సేవలు లభిస్తాయని విష్ణు వెల్లడించారు. అయితే 100రోజులలో మా లో మార్పు తీసుకొస్తాం.ఇచ్చిన హామీలను నెరవేర్చెలాకొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పిన మంచువిష్ణు..ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు ప్రత్యర్థి వర్గం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Janani Song : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. సినిమా మొత్తానికి సోల్ ఈ పాట..

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)