Viral Video: కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఎలాంటి జంతువునైనా కూడా ఈ విషసర్పం క్షణాల్లో..

Viral Video: కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!
Python
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2021 | 12:18 PM

సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఎలాంటి జంతువునైనా కూడా ఈ విషసర్పం క్షణాల్లో నమిలి మింగేస్తుంది. అంతటి బలశాలితో ఎవరైనా కూడా క్రేజీ.. క్రేజీగా ఆటలు ఆడతారా.? కానీ ఇక్కడొక వ్యక్తి భారీ కొండచిలువతో గేమ్స్ ఆడాడు. ఆ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యానికి గురవుతారు.

వైరల్ వీడియో ప్రకారం.. గుడ్లు నిండిన ఓ చిన్న టబ్‌లో కొండచిలువ సేద తీరుతోంది. ఈ తరుణంలో ఓ వ్యక్తి ఆ గుడ్లను తాకేందుకు ప్రయత్నిస్తాడు. తన గుడ్లను రక్షించుకునేందుకు కొండచిలువ అతడిపై దాడికి దిగుతుంది. వాటిని తాకేందుకు అతడు ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఆ వ్యక్తిపై కొండచిలువ దాడి చేస్తుంది. కొరికేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ‘jayprehistoricpets’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేసింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 56వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇదిలా ఉంటే.. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జే బ్రూవర్. ఇతడు కాలిఫోర్నియాలో ఓ రెప్‌టైల్ జూను పర్యవేక్షిస్తున్నాడు. వివిధ వర్ణాల్లోని కొండచిలువలను తరచూ వీడియోలు తీస్తూ.. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?