T20 Cricket: ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?

టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లదే హవా. మొదటి బంతి నుంచే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడతారు. స్టార్ బౌలర్లు సైతం...

T20 Cricket: ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?
Cricket
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 29, 2021 | 6:02 PM

టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లదే హవా. మొదటి బంతి నుంచే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడతారు. స్టార్ బౌలర్లు సైతం ఈ ఫార్మాట్‌లో చేదు అనుభవం ఎదుర్కోవాల్సిందే. ఈ పొట్టి ఫార్మాట్‌లో అప్పుడప్పుడూ ఓవర్‌కు 20-30 పరుగులు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే తాజాగా ఓ టీ20 మ్యాచ్ జరిగింది. అందులో సీన్ కాస్తా రివర్స్ అయింది. టీ20 మ్యాచ్‌లో టెస్ట్ బ్యాటింగ్ చేసింది ఓ జట్టు. మొత్తం ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి కేవలం 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15.4 ఓవర్లు అంటే 94 బంతులు బ్యాటింగ్ చేసి 27 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో కువైట్ ఉమెన్స్ వెర్సస్, నేపాల్ ఉమెన్స్ మధ్య జరిగింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆసియా రీజియన్ క్వాలిఫైయర్ల సిరీస్‌లో భాగంగా ఈ రెండు జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్ జట్టు 15.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 27 పరుగులకు ఆలౌట్ అయింది. కువైట్ బ్యాటర్లలో ఏడుగురు అస్సలు ఖాతానే తెరవలేదు. ఓపెనర్ ప్రియద మురళి(10) అత్యధిక స్కోరర్. నేపాల్ బౌలర్లలో సంగీతా రాయ్ 2.4 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. రుబీనా చెర్రీ రెండు మెయిడిన్లు వేసి 3 ఓవర్లలో కేవలం 1 పరుగు ఇచ్చి 2 వికెట్లు తీసింది.

21 బంతుల్లో మ్యాచ్ ఖతం…

కువైట్ విధించిన టార్గెట్ చాలా చిన్నది. ఏ జట్టైనా కూడా ఈజీగా చేధించగలదు. అయితే నేపాల్ జట్టు మాత్రం తొలి ఓవర్‌లోనే వికెట్ నష్టపోయింది. కానీ మరో వికెట్ పడకుండా నిలదొక్కుకుని.. లక్ష్యాన్ని 21 బంతుల్లో చేధించింది. తద్వారా కువైట్ జట్టుపై 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే! 

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ