IND vs NZ 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 345 పరుగులకు ఆలౌట్.. సెంచరీతో శ్రేయాస్, అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న గిల్, జడేజా

India vs New Zealand 1st Test Day 2: టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. సెంచరీతో శ్రేయాస్ అయ్యర్, అర్థసెంచరీలతో గిల్, జడేజాలు ఆకట్టుకున్నారు.

IND vs NZ 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 345 పరుగులకు ఆలౌట్.. సెంచరీతో శ్రేయాస్, అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న గిల్, జడేజా
India Vs New Zealand 1st Test Iyer, Jadeja, Gill
Follow us
Venkata Chari

|

Updated on: Nov 26, 2021 | 12:35 PM

India vs New Zealand 1st Test: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్లు త్వరగానే వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. తొలి రోజు భారత్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్కోర్‌తో రెండో రోజు ఆటను జడేజా, శ్రేయాస్ అయ్యర్‌లు ప్రారంభించారు. అయితే జడేజా(50 పరుగులు, 112 బంతులు, 6 ఫోర్లు) రెండో రోజు పరుగులేమీ చేయకుండానే సౌతీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో జడేజా, శ్రేయాస్ అయ్యర్‌లు ఇద్దరూ కలిసి 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత సాహా(1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక సౌతీకి వికెట్ సమర్పించుకున్నాడు. తన తొలి సెంచరీ చేసి దూకుడు మీదున్న శ్రేయాస్ అయ్యర్(105 పరుగులు, 171 బంతులు, 13 ఫోర్లు, 2 సిక్సులు) కూడా డ్రింక్స్‌ తరువాత తొలి బంతికే సౌతీకి చిక్కాడు. ఆ తరువాత అక్షర్(3) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఉమేష్ యాదవ్ 10 నాటౌట్, అశ్విన్ 38, ఇషాంత్ శర్మ 0 పరుగులు చేశారు. దీంతో టీమిండియా మొత్తంగా 390 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 5, కైల్ జైమీసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

తొలి రోజు టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్‎మన్ గిల్.. మంచి ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. మయాంక్‌ అగర్వాల్‌ 28 బంతుల్లో రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి జేమీసన్‌ బౌలింగ్‌లో కీపర్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా.. గిల్‎తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 87 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‎తో 52 పరుగులు చేశాడు. దీంతో టీమ్ఇండియా భోజన విరామ సమయానికి 82/1తో నిలిచింది.

భోజన విరామం అనంతరం 52 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌ జెమీసన్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానె, పుజారాతో కలిసి ఆచితూచి ఆడారు. జట్టు స్కోర్ 106 పరుగుల వద్ద పుజారా సౌథీ బౌలింగ్‎లో వెనుదిరిగాడు. కాసేపటికే 35 పరుగులు చేసిన కెప్టెన్ రహానెను జెమీసన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఇక మూడో సెషన్‎లో శ్రేయాస్ అయ్యర్, రవింద్ర జడేజా కివీస్ బౌలర్లను ఆడుకున్నారు. చెత్తు బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో శ్రేయాస్ తన తొలి టెస్ట్‎లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆట ముగిసే ముందు జడేజా కూడా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‎లతో 75 పరుగులు, జడేజా 100 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేశారు.

Also Read: T20 Cricket: ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?

భారత విజయానికి ఒక వికెట్.. దక్షిణాఫ్రికా గెలిచేందుకు 6 పరుగులు.. చివరి ఓవర్ బౌల్ చేసిన లిటిల్ మాస్టర్.. ఫలితం ఏంటో తెలుసా? (వీడియో)