భారత విజయానికి ఒక వికెట్.. దక్షిణాఫ్రికా గెలిచేందుకు 6 పరుగులు.. చివరి ఓవర్ బౌల్ చేసిన లిటిల్ మాస్టర్.. ఫలితం ఏంటో తెలుసా? (వీడియో)

Sachin Tendulkar: 'ఈ మ్యాచులో అప్పటి వరకు సచిన్ ఒక్క బంతి కూడా వేయని నేను, ఆశ్చర్యకరంగా చివరి ఓవర్, అది కూడా దక్షిణాఫ్రికా విజయానికి కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నప్పుడు బౌలింగ్ చేశానని' సచిన్ పేర్కొన్నాడు.

భారత విజయానికి ఒక వికెట్.. దక్షిణాఫ్రికా గెలిచేందుకు 6 పరుగులు.. చివరి ఓవర్ బౌల్ చేసిన లిటిల్ మాస్టర్.. ఫలితం ఏంటో తెలుసా? (వీడియో)
1993 Hero Cup, Ind Vs Sa Semi Final Sachin Tendulkar


1993 Hero Cup, IND vs SA Semi Final: 1993 హీరో కప్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ వేసిన 50వ ఓవర్ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతయింది. దక్షిణాఫ్రికా జట్టు విజయానికి ఆఖరి ఓవర్‌లో 6 పరుగులు కావాల్సని సమయంలో అప్పటి వరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని సచిన్‌కు 50వ ఓవర్‌ అప్పగించారు. దీంతో చివరి ఓవర్ వేసిన లిటిల్ మాస్టర్.. కేవలం మూడు పరగులు మాత్రమే ఇచ్చి, టీమిండియా విజయానికి కారణమయ్యాడు. ఈమేరకు ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్.. ఒత్తిడిలో అద్భుతంగా రాణించినట్లు పేర్కొన్నాడు.

“నేను 50వ ఓవర్ వరకు అస్సలు బౌలింగ్ చేయలేరు. వాతావరణం చాలా చల్లగా ఉంది. కానీ మ్యాచు మాత్రం ఫుల్ హిట్‌లో ఉంది”అని సచిన్ టెండూల్కర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

బౌలింగ్ చేస్తానని అజహర్‌కి చెప్పాను..
సచిన్ టెండూల్కర్ తన కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌తో మాట్లాడుతూ, మ్యాచ్ చివరి ఓవర్‌ను బౌలింగ్ చేస్తానని నమ్మకంగా తెలిపారు. ప్రతీ పరుగు ముఖ్యమని టెండూల్కర్ పేర్కొన్నారు. ప్రేక్షకులందరూ భారత జట్టుతో ఉన్నారని పేర్కన్నారు. 48 ఏళ్ల క్రికెట్ లెజెండ్ తాను వేసిన ప్రతి డాట్ బాల్‌ను ప్రేక్షకులు మెచ్చుకున్నారని, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగిందని పేర్కొంటూ ముగించారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 195 పరుగులకే ఆలౌట్ అయింది. అజారుద్దీన్ 90, ప్రవీణ‌ అమ్రే 48 మాత్రమే రాణించారు. టెండూల్కర్ 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా కనీసం రెండంకెల స్కోర్‌ కూడా నమోదు చేయలేకపోయారు. అనంతరం 196 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 193 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Also Read: Shreyas Iyer: డెబ్యూ టెస్ట్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్.. తొలి సెంచరీ పూర్తి.. 16వ భారత ప్లేయర్‌గా రికార్డు

IND vs NZ 1st Test, Day 2 LIVE Score: లంచ్ బ్రేక్.. టీమిండియా స్కోర్ 339/8.. క్రీజులో అశ్విన్ 38, ఉమేష్ 4

Click on your DTH Provider to Add TV9 Telugu