Shreyas Iyer: డెబ్యూ టెస్ట్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్.. తొలి సెంచరీ పూర్తి.. 16వ భారత ప్లేయర్‌గా రికార్డు
కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు డెబ్యూ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ తన తొలి సెంచరీని పూర్త చేశాడు.
India vs New Zealand 1st Test: కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు డెబ్యూ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ తన తొలి సెంచరీని పూర్త చేశాడు. 75 పరుగులతో(136) రెండో రోజు తన ఆటను ప్రారంభించిన శ్రేయాస్ అయ్యర్.. న్యూజిలాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి తన సెంచరీని పూర్త చేశాడు. 157 బంతుల్లో తన డెబ్యూ సెంచరీని సాధించాడు. ఇందులో 12 ఫోర్లు, 2 సిక్సులు కూడా ఉన్నాయి. దీంతో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన 16వ టీమిండియా ఆటగాడిగా రికార్డల్లోకి ఎక్కాడు. అలాగే న్యూజిలాండ్‌తో అరంగేట్రం చేసి సెంచరీ చేసిన 3వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ.. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. తన అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. రెండో సెషన్‌లో కివీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించి జట్టు భారీ వికెట్లను పడగొట్టారు. అటువంటి పరిస్థితిలో, అయ్యర్ ఆధిక్యంలోకి వెళ్లి సరైన ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజాతో కలిసి 113 పరుగుల కీలక భాగస్వామ్యం అదించాడు. ఒత్తిడి పరిస్థితుల్లో స్టార్ ప్లేయర్లు పెవిలియన్ చేరినా.. అయ్యర్, జడేజాలు మాత్రం వారి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.
ఇప్పటి వరకు 22 వన్డేలు ఆడిన శ్రేయాస్ అయ్యర్ 100 స్ట్రైక్ రేట్‌తో 813 పరుగులు సాధించాడు. ఇందేలో ఓ సెంచరీ, 8 అర్థ సెంచరీలు చేశాడు. అలాగే 103 తన అత్యధికంగా నిలిచింది. అలాగే 32 టీ20లు ఆడి 132 స్ట్రైక్‌రేట్‌తో 580 పరుగులు సాధించాడు. ఇక టీ20ల్లో మాత్రం 3 అర్థసెంచరీలు సాధించాడు. అలాగే 67 పరుగుల అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు.
A special moment for @ShreyasIyer15 ?
Live – https://t.co/9kh8Df6cv9 #INDvNZ @Paytm pic.twitter.com/HA7yJiB1Hg
— BCCI (@BCCI) November 26, 2021
The latest addition into the Centuries on debut for India club – @ShreyasIyer15 ?#TeamIndia #INDvNZ @Paytm pic.twitter.com/r9yl1kFjQa
— BCCI (@BCCI) November 26, 2021
Also Read: Pat Cummins: ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..
IND vs NZ 1st Test, Day 2 LIVE Score: తొలి సెంచరీ పూర్తి చేసిన శ్రేయాస్ అయ్యర్..!