IND vs PAK: పాక్‎తో మ్యాచ్‎కు ముందే టీమిండియా భయపడింది.. ఇంజమామ్-ఉల్-హక్ వివాదాస్పద వ్యాఖ్యలు..

పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ టీ20 వరల్డ కప్‎లో భారత క్రికెట్ జట్టు ప్రదర్శనపై నోరు పరేసుకున్నాడు. పాక్‎తో మ్యాచ్‎కు ముందే విరాట్ కోహ్లీ అండ్ కో భయపడిందని అన్నాడు. ప్రపంచ కప్‌లలో మొదటిసారిగా మెన్ ఇన్ బ్లూ వారి చిరకాల ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయిందని చెప్పాడు...

IND vs PAK: పాక్‎తో మ్యాచ్‎కు ముందే టీమిండియా భయపడింది.. ఇంజమామ్-ఉల్-హక్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Inzamam
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 26, 2021 | 12:11 PM

పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ టీ20 వరల్డ కప్‎లో భారత క్రికెట్ జట్టు ప్రదర్శనపై నోరు పరేసుకున్నాడు. పాక్‎తో మ్యాచ్‎కు ముందే విరాట్ కోహ్లీ అండ్ కో భయపడిందని అన్నాడు. ప్రపంచ కప్‌లలో మొదటిసారిగా మెన్ ఇన్ బ్లూ వారి చిరకాల ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయిందని చెప్పాడు. పాకిస్తా న్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసిందన్నారు. “మ్యాచ్ ప్రారంభం కాకముందే ఇండియన్ ఆటగాళ్లు భయపడ్డారని నేను భావిస్తున్నాను. టాస్‌లో విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌ల ఇంటర్వ్యూ చూస్తే వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే, ఎవరు ఒత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మా జట్టు బాడీ లాంగ్వేజ్ వారి కంటే చాలా బాగుంది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత్ ఒత్తిడికి లోనైంది. శర్మ స్వయంగా ఒత్తిడికి లోనయ్యాడు. వారంతా ఒత్తిడిలో ఉన్నారని స్పష్టమైంది” అని ఇంజమామ్ ARY న్యూస్‌తో మాట్లాడాడు. ఇండియా ఐసీసీ టోర్నమెంట్‎లో నాకౌట్‎కు చేరకపోవడం గత ఎనిమిది సంవత్సరాల్లో ఇదే మొదటిసారి.

పాకిస్తాన్ ఓటమి తర్వాత భారత జట్టు ఒత్తిడిని ఎదుర్కొందని ఇంజమామ్ అన్నాడు. తద్వారా జట్టు ఓటమి నుండి కోలుకోలేకపోయిందని చెప్పాడు. “భారత జట్టు ఎప్పుడూ ఆడిన విధంగా ఆడదు. వారిది మంచి టీ20 జట్టు, అందులో ఎటువంటి సందేహం లేదు. గత 2-3 సంవత్సరాలలో వారి ప్రదర్శనను మీరు చూస్తే, వారు ఫేవరెట్‌గా ఉన్నారు. కానీ ఆ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది ఎవరు ఒత్తిడిలో ఉన్నారని.”అని ఇంజమామ్ తెలిపారు. ” పాకిస్తాన్‌తో ఓడిపోయిన తర్వాత, వారు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. 3-4 రోజుల విరామం తర్వాత న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్‎లో సాంట్నర్, సోధిని కూడా ఆడలేకపోయారని అన్నాడు.

Read Also.. Pat Cummins: ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‎గా పాట్ కమిన్స్.. వైస్ కెప్టెన్‎గా స్టీవ్ స్మిత్..