AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

మరో నెల రోజుల్లో 2021 సంవత్సరానికి వీడ్కోలు పలకబోతున్నాం. ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం...

Zodiac Signs: ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!
Zodiac Signs
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 27, 2021 | 5:58 PM

Share

మరో నెల రోజుల్లో 2021 సంవత్సరానికి వీడ్కోలు పలకబోతున్నాం. ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం 2022కు స్వాగతం పలకనున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది కొన్ని రాశులకు శుభప్రదం అని జోతిష్య పండితులు అంటున్నారు. కొత్త సంవత్సరం 2022లో 6 రాశులవారికి గొప్పగా ఉండబోతోందట. వారికి అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం.. 2022వ సంవత్సరంలో ఏయే రాశులకు లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహరాశి:

ఈ రాశివారికి వచ్చే సంవత్సరం శుభం, అదృష్టం వరిస్తుంది. వీరు కొత్త సంవత్సరం వేళ అనే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొత్త సంవత్సరంలోనూ ఇతరులకు సహాయం చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ మంచి పనే మీకు శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది.

వృశ్చికరాశి:

ఈ రాశివారికి వచ్చే ఏడాది ఎంతగానో శుభప్రదం. వీరి కలలను సాకారం చేసుకోగలరు. వీరికి వచ్చే సంవత్సరం అంతా సానుకూలత ఉంటుంది. కాబట్టి వీలైనన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి.

వృషభరాశి:

ఈ రాశివారికి కొత్త సంవత్సరంలో ఎల్లవేళలా సంతోషం ఉంటుంది. కెరీర్‌లో పురోగతి కనిపిస్తుంది. వీరు తమ సంపాదనను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది.

కుంభరాశి:

కొత్త సంవత్సరం వేళ ఈ రాశివారికి ధన లాభం ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది వీరి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. వీరు తమ ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నట్లయితే.. 2022 మీకు గొప్ప సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.

తులారాశి:

ఈ రాశివారికి కొత్త సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరి ప్రేమ జీవితం గొప్పగా ఉండబోతోంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొన్ని కష్టాలు ఎదురైనా కూడా ధీటుగా పోరాడతారు.

మకరరాశి:

ఈ రాశివారికి కొత్త సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. అన్నింటా విజయపధంలో దూసుకుపోతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?