Zodiac Signs: ఈ 3 రాశులవారు ఇతరులపై అస్సలు ద్వేషం పెంచుకోరు.. ముక్కు సూటిగా మాట్లాడతారు!
ద్వేషం, గొడవలు అనేవి ఉంటే.. మన జీవితం సాఫీగా సాగదు. ఇతరులు చేసిన తప్పులను క్షమించి.. వారిని కలుపుకుని...
ద్వేషం, గొడవలు అనేవి ఉంటే.. మన జీవితం సాఫీగా సాగదు. ఇతరులు చేసిన తప్పులను క్షమించి.. వారిని కలుపుకుని ముందుకు సాగడమే జీవితం అనేది. ఇలాంటి గుణం చాలామందికి ఉండదు. దీనికి ఎంతగానో ధైర్యం కావాలి. ఎందుకంటే.. వారి ఏంటి అని మీకు తెలిసి.? వారిపై మరోసారి నమ్మకం పెట్టడం అంటే చాలా కష్టం. కానీ కొన్ని సందర్భాల్లో పెట్టక తప్పదు.
ఇదిలా ఉంటే.. జోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతీ రాశికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఒకరికి, మరొకరి మధ్య చాలా పొంతన ఉంటుంది. ప్రతీ ఒక్కరి వ్యక్తిత్వం వారి రాశుల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే 3 రాశులవారు అస్సలు ద్వేషం అనేది చూపించరట. అందరినీ ప్రేమించుకుంటూ పోతారట. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మీనరాశి:
ఈ రాశివారు పైకి మొరటగా కనిపించవచ్చు. అయితే మాత్రం వీరు ఎప్పుడూ కూడా ఇతరులపై ద్వేషం పెంచుకోరు. ఏది ఉన్నా సూటిగా చెప్పేస్తారు. ఈ విధంగా తమలోని బాధను తీర్చుకుని మళ్లీ మాములు అయిపోతారు. ఇతరులు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపించడం గానీ.. వాటి గురించి మాట్లాడటం గానీ అస్సలు చేయరు.
కర్కాటక రాశి:
ఈ రాశివారు ఎప్పుడూ దురుద్దేశం కలిగి ఉండరు. వీరు చింతలు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటారు. ఇది జరగాలంటే ద్వేషం అనేది ఉండకూడదని భావిస్తారు. ఇతరులు చేసిన తప్పులను క్షమించడం, వారు చేసిన పనులను మర్చిపోవడం మంచిదిగా భావిస్తారు. ఇది కొన్నిసార్లు వారిని బాధపెట్టినా.. ప్రజలందరూ ఒకేలా ఉండరన్న దానిని విశ్వసిస్తారు. జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుభవించాల్సి ఉంటుందని అంటుంటారు.
సింహరాశి:
ఈ రాశివారు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎదుటివారిపై నిందలు వేయడం వీరికి ఇష్టముండదు. వీరు ఒక్కసారి తప్పు చేసిన వ్యక్తులను క్షమించినట్లయితే.. మళ్లీ గత తప్పులను ఎత్తి చూపిస్తూ వారిని నిందించరు. వీరి వ్యక్తిత్వంలో ద్వేషం అనేది లేదు. ఎవరైనా కూడా ఈ రాశివారిని తీవ్రంగా బాధపెట్టినా.. ఇతడు క్షమిస్తే.. ఖచ్చితంగా పాత తప్పులు ఎత్తి చూపరు.
కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!
ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!
ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?