AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.. సమస్యలను అధిగమిస్తారు..!

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు..

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.. సమస్యలను అధిగమిస్తారు..!
Subhash Goud
|

Updated on: Nov 27, 2021 | 9:12 AM

Share

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. శనివారం (నవంబర్ 27న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాదిక్యతతో దూరప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

వృషభం ప్రయాణాలలొ మార్గావరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు. ప్రత్యర్థుల నుంచి ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలనాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి. మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

సింహం ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలుగుతాయి.

కన్య వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రులతో కలహా సూచనలున్నవి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

తుల వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలొ శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ధనస్సు కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ముఖ్యమైన పనులలో కార్యాటంకములు కలుగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.

మకరం వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

మీనం నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారి సంఖ్యను పెంచేందుకు అనుమతి..!

Know This: నన్ను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేసి నా అండాలను ఎత్తికెళ్లాయి !! వీడియో