WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. డిజిటల్ పేమెంట్స్ చేసేవారి సంఖ్యను పెంచేందుకు అనుమతి..!
WhatsApp Payments: ప్రస్తుతం వాట్సాప్ వినియోగం పెరిగిపోయింది. వాట్సాప్ లేనిది స్మార్ట్‌ఫోన్ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ వినియోగిస్తున్నారు...
WhatsApp Payments: ప్రస్తుతం వాట్సాప్ వినియోగం పెరిగిపోయింది. వాట్సాప్ లేనిది స్మార్ట్‌ఫోన్ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు. ఇక వాట్సాప్ భారతదేశంలో తన చెల్లింపుల సేవలను మరింతగా మెరుగుపరుస్తోంది. చెల్లింపులు చేసే వినియోగదారుల సంఖ్య 40 మిలియన్ల వరకు పెంచుకోవడానికి రెగ్యులేటరీ ఆమోదం పొందిందని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే భారతదేశంలో తన చెల్లింపుల సేవను ఉపయోగించే వినియోగదారులపై ఎటువంటి పరిమితి ఉండకూడదని కంపెనీ అభ్యర్థించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ వారం కంపెనీకి తన చెల్లింపు సేవలను అందించగల యూజర్ బేస్‌ను రెట్టింపు చేసుకోవచ్చని తెలిపింది.
ప్రస్తుతం 20 మిలియన్లకు పరిమితం మాత్రమే ఉండగా, దానిని 40 మిలియన్లకు పెంచుకోవచ్చని అనుమతులు లభించాయి. ఇక భారతదేశంలో డిజిటల్ మార్కెట్లో గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం, వాల్‌మార్కట్, ఇతర డిజిటల్ యాప్‌లతో వాట్సాప్ పోటీ పడుతుంది. చెల్లింపులకు సంబంధించిన మొత్తం డేటాను స్థానికంగా నిల్వ చేయాల్సిన డేటా స్టోరేజీ నిబంధనలతో సహా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా ఈ ఆమోదం లభించింది. ఆన్‌లైన్ లావాదేవీలు, రుణాలు, ఇ-వాలెట్ సేవలు దేశంలో వేగంగా పెరిగిపోతున్నాయి. దేశంలోని నగదు-వ్యాపారులు, వినియోగదారుల డిజిటల్ చెల్లింపులను స్వీకరించేలా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తోంది.
ఇవి కూడా చదవండి: